రాష్ట్రీయం

ఆశీర్వదించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం/ కొత్తవలస, సెప్టెంబర్ 24: వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని వైసీపీ అధినేత జగన్ ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మరోసారి మోసపోవద్దని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన జిల్లాలోని కొత్తవలస మండలం చింతలపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తవలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మావోల చేతిలో మృతి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుమృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి వల్ల పోలవరం ప్రాజెక్టు రేట్లు పెంచి, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం వల్ల ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందన్నారు. నాలుగున్నరేళ్లుగా పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు కూడా దాటలేదని విమర్శించారు. డిజైన్లు కూడా ఖరారు కాని పరిస్ధితి నెలకొందన్నారు. రెండెకరాల వ్యక్తి నేడు రూ.4 లక్షల కోట్ల ఆస్తిపరుడిగా
ఎలా ఎదిగారని చంద్రబాబును ప్రశ్నించారు. జిల్లాలో చక్కెర, జ్యూట్ మిల్లులు మూతపడుతున్నాయని, కొత్త పరిశ్రమలు రాలేదని దుయ్యబట్టారు. విభజన సమయంలో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయన్న చంద్రబాబు ఆ తరువాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసారని ప్రశ్నించారు.. రాష్ట్రంలో వ్యవసాయం భారంగా మారిందన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆయన అమెరికాలో ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రసంగించడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. రాష్ట్రంలో గుంటూరు నుంచి అనంతపూర్ వరకు ఏడు జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నా, సీఎంకు చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. నాబార్డు నివేదిక ప్రకారం రైతులకు వస్తున్న ఆదాయంలో మన రాష్ట్రం చిట్టచివరి స్థానంలోను, రైతుల అప్పుల విషయంలో రెండో స్థానంలోనూ ఉందని గుర్తుచేశారు. రైతులకు సరైన ప్రోత్సాహకాలు అందడం లేదన్నారు. గతంలో రైతులకు వడ్డీలేని రుణాలు అందేవని, నేడు రైతుల తరఫున ప్రభుత్వం వడ్డీ డబ్బులు కట్టడం మానేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా పేదలకు మేలు చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా, జగన్‌కు స్వాగతం పలికిన వారిలో వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి, పీ. సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్‌లతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం..బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైసీపీ అధినేత జగన్