రాష్ట్రీయం

‘అమృత్’ అమలులో ఏపీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (అమృత్) పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కొత్త ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ చేతులమీదుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, అమృత్ మిషన్ డైరెక్టర్ కన్నబాబు ఈమేరకు అవార్డు అందుకున్నారు. 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మంచినీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు, తదితర లక్ష్యాలతో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం అమలు చేస్తున్న రాష్ట్రాల మధ్య పోటీ పెంచేందుకు ర్యాంక్‌ల విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అమృత్ పథకం కింద డీపీఆర్ రూపకల్పన, యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు సమర్పించడం, పనుల పురోగతి, తదితర అంశాల ఆధారంగా ర్యాంక్‌లు ఇస్తారు. ఈ అంశాల్లో ఏపీ గణనీయమైన ప్రగతితో 65.24 శాతం మార్కులను సాధించి దేశంలో మొదటి స్థానం పొందింది. తరువాతి స్థానాలను 59.17 శాతం మార్కులతో ఒడిశా, 54.32 శాతం మార్కులతో మధ్యప్రదేశ్, 52.39 శాతం మార్కులతో తెలంగాణ కైవసం చేసుకున్నాయి. ఈసందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ పనితీరుకు ఈ గుర్తింపు నిదర్శమని సంతోషం వ్యక్తం చేశారు.

చిత్రం..కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ నుంచి అవార్డు అందుకుంటున్న కన్నబాబు