రాష్ట్రీయం

నల్లమలపై నిఘా పెంచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 24: నల్లమల అటవీప్రాంతంపై నిఘాపెంచామని, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే నేతలు పోలీసులకు సమాచారం అందించి వెళ్ళాలని ఇప్పటికే వర్తమానం పంపామని ప్రకాశం జిల్లా మార్కాపురం డీవైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. ఆదివారం అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీఎమ్మెల్యే సోమాను మావోయిస్టులు హత్య చేసిన సంఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నల్లమల అటవీప్రాంతంలో నిఘా పెంచామన్నారు. నేతలు ఎవరైనా అత్యంతవసర పరిస్థితుల్లో లోతట్టుప్రాంతాలకు వెళ్ళే సమయంలో సమాచారం ఇస్తే, వారికి తగిన భద్రత కల్పిస్తామన్నారు. వారు ప్రయాణించే రహదారులను బాంబుస్వ్కాడ్ ద్వారా తనిఖీలు చేయిస్తామన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ ముందస్తు చర్యగా గతంలో కంటే అధికంగా కూంబింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. డివిజన్‌లోని అందరు సీఐలకు, ఎస్సైలకు నేతల భద్రతపై సమాచారం ఇచ్చామన్నారు. నేతలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఇలావుంటే, 1999 నుంచి 2008 వరకు నల్లమల అటవీప్రాంతంలో ఓవైపున పోలీసుల బూట్లచప్పుళ్ళు, మరోవైపు మావోయిస్టుల తుపాకుల తూటాలతో దడదడలాడింది. అప్పట్లో నిత్యం మావోయిస్టుల చర్యలు పోలీసుల ఎన్‌కౌంటర్లతో నేతలకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు శాఖమూరి అప్పారావు, మట్టా రవి కుమార్, రాష్ట్ర కార్యదర్శి మాధవ్ లాంటి నేతలు ఈప్రాంతంలో పోలీసుల తూటాలకు బలయ్యారు. 2007 డిసెంబర్‌లో నల్లమల కార్యదర్శి సాగర్ అలియాస్ పాండురంగా రెడ్డి, సింగా ప్రసాద్ లాంటి నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో మావోయిస్టు చర్యలకు దాదాపుగా పుల్‌స్ట్ఫా పడింది. అలాగే మావోయిస్టులువాడే రాకెట్‌లాంచర్లకు మార్కాపురం డివిజన్ కేంద్ర బిందువుగా మారి టెక్ మధును అరెస్టు చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలకు ఇంతటి ప్రాచూర్యం ఉన్న నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి మావోయిస్టుల అలజడులు లేకపోయినప్పటికీ అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీఎమ్మెల్యే సోమాలను హత్య చేసిన తరువాత పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి నల్లమలపై ప్రత్యేక దృష్టి సారించారు.