రాష్ట్రీయం

ఘాతుకానికి పాల్పడింది వీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్టిపుట్టు వద్ద ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను ఆదివారం హత్య చేసిన మావోయిస్టుల ఫొటోలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం విడుదల చేసింది. ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన మావోల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఈ ఘటనలో కొరాపుట్ దళానికి చెందిన సుమారు 20 మంది మహిళలు, 30 మంది పురుషులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇండిలిజెన్స్ అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై లిప్టిపుట్టు వద్ద జరిగిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును వీరు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తరువాత ముగ్గురు మావోయిస్టుల ఫొటోలను విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, రైనో ఈ హత్యకు పాల్పడినవారిలో ఉన్నారు. అలాగే పశ్చిమగోదావి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, సింద్రి చింద్రి, రింకీ ఉన్నట్టు గుర్తించారు. అలాగే విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ ఉన్నారు.
కాగా, సివేరి సోము, కిడారి సర్వేశ్వరరావును హతమార్చేందుకు కోరాపుట్ దళ నాయకుడు చలపతి స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే. ఆయన కనుసన్నలలోనే దళంలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పీటీజీలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో చలపతి భార్య అరుణ నాయకత్వం వహించినట్టు తెలుస్తోంది.

*పోలీసులు విడుదల చేసిన మావోయస్టుల ఫొటోలు -
శ్రీనుబాబు, కామేశ్వరి, అరుణ