రాష్ట్రీయం

రాజగోపాల్‌కు మరో షోకాజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ క్రమశిక్షణా సంఘం సోమవారం మరో షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ దఫా సమాధానం చెప్పేందుకు 24 గంటల గడువే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా శనిలా దాపురించారని వ్యాఖ్యానించడమే కాకుండా టిక్కెట్ల విషయంలోనూ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ క్రమశిక్షణా సంఘానికి నివేదించారు. మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి నేతృత్వంలోని క్రమశిక్షణా సంఘం రెండు రోజుల క్రితం సమావేశమై రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కాగా అదేరోజు రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ అనలేదని, కార్యకర్తల మనోభావాలను తెలియజేశానని వివరణ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి షోకాజ్‌కు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ సీల్డ్ కవర్ పంపించారు. కానీ ఆ సమాధానంతో క్రమశిక్షణా సంఘం సంతృప్తి చెందలేదు. పైగా అక్కడితో ఆగకుండా మునుగోడులో జరిగిన సభలో
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడాన్ని, షోకాజ్ నోటీసు ఇచ్చిన రోజే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలనూ పార్టీ క్రమశిక్షణా సంఘం సీరియస్‌గా తీసుకుంది. సోమవారం సంఘం చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో సమావేశమైన సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని క్రమశిక్షణా సంఘం సభ్యులు తప్పుపట్టారు. వీటిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్‌లో పేర్కొన్నారు.