రాష్ట్రీయం

మార్పులు ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీలో రేగిన అసమ్మతి చిచ్చు నేపథ్యంలో జాబితాలో మార్పులుంటాయన్న ప్రచారానికి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు తెరదించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇంతకు ముందే ప్రకటించిన అభ్యర్థులలో ఎలాంటి మార్పు ఉండబోదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ప్రకటించిన అభ్యర్థిని మార్చి తమకు టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నట్టు పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. దీంతో ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయడానికి అభ్యర్థులు తటపటాయిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్, పార్టీ వర్గాల ద్వారా తెలుసుకున్న అధినేత ‘ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థుల మార్పు ఉండదు. అలా మార్చుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకునే ప్రమాదం ఉంటుంది’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. తమను మార్చేస్తారేమో అన్న అనుమానంతో కొందరు అభ్యర్థులు మొక్కుబడిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు అధిష్ఠానం దృష్టికి వచ్చింది. అలాంటి అపనమ్మకంతో ఉన్న అభ్యర్థులకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి భరోసా ఇచ్చినట్టు చెబుతున్నారు. మిగిలిన స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించబోతున్నానని పేర్కొన్న కేసీఆర్ ఇంతకుముందు ప్రకటించిన జాబితాలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసినట్టు సమాచారం. ‘ప్రచారాన్ని ఉద్ధృతం చేయండి. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించకముందే నియోజకవర్గాల్లో మొదటి దశ ప్రచారం పూర్తి కావాలి’అని అధినేత ఆదేశించారు. అక్టోబర్ రెండోవారం కల్లా కల్లా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, అప్పటి వరకు నియోజకవర్గంలోని గ్రామాలన్నింటినీ చుట్టిరావాలని సూచించినట్టు సమాచారం. ఇలా ఉండగా కేసీఆర్ ఫోన్ చేసిన అభ్యర్థులకే ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసి తనను కలుసుకోవాల్సిందిగా సూచించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కేటీఆర్ నుంచి ఫోన్ రాగానే మహబూబాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హైదరాబాద్‌కు వచ్చి కలిశారు. ‘మహబూబాబాద్‌లోనే కాదు ఎక్కడా అభ్యర్థులను మార్చడం లేదు. ప్రచారాన్ని ఉద్ధృతం చేయండి’ అని చెప్పి పంపించారు. స్టేషన్ ఘనపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా ప్రచారాన్ని ఉద్ధృతం చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. తన టిక్కెట్‌ను రద్దుచేయడానికి చేయించడానికి కుట్రలు పన్నుతున్నారని రాజయ్య వాపోయినట్టు తెలిసింది. తామేమి వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రచారం చేసుకోమని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్టు తెలిసింది. రాజయ్యకు భరోసా కల్పించేందుకు శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని స్వయంగా స్టేషన్ ఘనపూర్ పంపించినట్టు సమాచారం. ఇక్కడ రాజయ్యకు బదులుగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్య కానీ, రాజారపు ప్రతాప్‌కు కానీ టికెట్ ఇవ్వాలని కొందరు కార్యకర్తలు అధిష్ఠానంపై తీవ్ర వత్తిడి చేసిన విషయం తెలిసిందే. అయితే రాజయ్యను మార్చడం లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ద్వారా నియోజకవర్గ అసమ్మతి నేతలకు సమాచారం పంపినట్టు తెలిసింది. దీంతో రెండు రోజులుగా రాజయ్య తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.
ఇక మొదటి విడతలో ప్రకటించిన అభ్యర్థలకు ప్రచార సామాగ్రిని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి సోమవారం నియోజకవర్గాలకు పంపించింది. పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ప్రచార సామాగ్రి చేరవేతను పర్యవేక్షిస్తున్నారు.
చిత్రం..సోమవారం తెలంగాణ భవన్ నుంచి అభ్యర్థులకు పంపిస్తున్న ఎన్నికల ప్రచార సామగ్రి