రాష్ట్రీయం

బాక్సింగ్‌లో సత్తా చాటిన తెలంగాణ చిన్నారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఇటలీలో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఈ నెల 13 నుంచి 23 వరకు వెనిస్ వేదికగా జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కుమారి పెండం చందన రెండు బంగారు పతకాలు సాధించగా, కుమారి ఉప్పనీతల మైత్రి కాంస్య పతకాన్ని గెలుచుకొంది. ఇండియాకు దక్కిన మూడు పతకాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికే దక్కడం విశేషం. తెలంగాణ రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసొసియేషన్ అధ్యక్షుడు, ఇటలీ ఛాంపియన్‌షిప్ రెఫరీగా వ్యవహరించిన రామాంజనేయులు ఈ పతకాలు సాధించిన వారి వివరాలను తెలంగాణ భవన్‌లో సోమవారం వివరించారు. తెలంగాణ చిన్నారులు కిక్ బాక్సింగ్ అంతర్జాతీయ వేదికలపై ప్రతిభాపాటవాలను చాటారని ఆయన కొనియాడారు.