రాష్ట్రీయం

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న శ్రీవారిసేవా టికెట్ల దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 24: తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి టీటీడీ ప్రవేశపెట్టిన ఆర్జితసేవలకు టిక్కెట్ల జారీలో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కొన్ని లోపాలను అదునుగా తీసుకుని దళారులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. దీంతో కోట్లు గడిస్తున్నారు. భక్తుల గుర్తింపు కార్డులను మార్ఫింగ్‌లకు పాల్పడి సామాన్య భక్తులకు ఆర్జితసేవ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈనేపధ్యంలో ఇటీవల సేలంకు చెందిన రామస్వామి, పద్మావతి శ్రీవారి సుప్రభాత సేవకు హాజరయ్యారు. టికెట్లు తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు వీరి ఫ్రూఫ్‌లు, వచ్చిన వ్యక్తులు వేరుగా ఉండటంతో అనుమానించి ఆరా తీశారు. శశికుమార్, రాజేశ్వరి అనే వ్యక్తుల ఐడీల మార్ఫింగ్‌తో శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు గుర్తించారు. వీరికి బాలచందర్ అనే వ్యక్తి ఈ నకిలీ టికెట్లను విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. సుప్రభాతం మొదలుకుని స్వామివారికి జరిగే ప్రత్యేక సేవలను బట్టి టికెట్లను దళారీలు వాటి ధరలను నిర్ణయిస్తున్నారు. ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు విడుదల చేసే ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో వేలకు పైగా గుర్తుతెలియని వ్యక్తులు ఐడి ఫ్రూప్‌లను మార్పింగ్‌కు పాల్పడి నెలకు వందల సంఖ్యలో టికెట్లను పొంది అధిక ధరలకు భక్తులకు విక్రయించుకుంటున్నారు. మొన్న సోలాపూర్, నిన్న టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి, నేడు తమిళనాడుకు చెందిన బాలచందర్ ఇలా కూపీ లాగుతూ పోతుంటే ఆన్‌లైన్ టికెట్ల స్కాం దేశవ్యాప్తంగా బయటపడుతున్నాయి. ఆదివారం సేలంకు చెందిన రామస్వామి, పద్మావతి దంపతులకు 2 సుప్రభాత సేవా టికెట్లను రెండువేల రూపాయలకు బాలచందర్ అనే దళారీ విక్రయించాడు. ఫ్రూప్‌లో ఫొటోలు తేడా రావడంతో టికెట్లలో ఉన్న పేర్లు, వచ్చిన వ్యక్తులు వేరుగా ఉండటంతో విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆరా తీశారు. విజిలెన్స్ అధికారుల విచారణలో శశికుమార్, రాజేశ్వరి అనే వ్యక్తుల ఐడీలతో తమకు తమిళనాడుకు చెందిన బాలచందర్ అనే వ్యక్తి విక్రయించినట్లు రామస్వామి తెలిపారు. గతంలో కూడా కొన్ని వేల టికెట్లను బాలచందర్ పొంది ఇలా ఐడీలు మార్ఫింగ్ చేసి వేల రూపాయలకు టికెట్లు అమ్ముకున్నట్లు విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. బాలచందర్ ఆన్‌లైన్‌లో సుమారు 1850సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసినట్లు, 100కు పైగా సుప్రభాతం టికెట్లు పొందినట్లు విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ అధికారులు అన్ని యత్నాలు చేస్తున్నారు.