రాష్ట్రీయం

ఏరియా డామినేషన్ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం లిప్టిపుట్టు వద్ద ఆదివారం జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. అదే సమయంలో పోలీసుల బందోబస్త్ లేకుండా కేవలం ముగ్గురు గన్‌మేన్‌లతో ఏజెన్సీలో పర్యటనకు వెళ్లడంలో ప్రజా ప్రతినిధుల అతివిశ్వాసం బహిర్గతమవుతోంది.
ఒక వీఐపీ, వీవీఐపీ ఏదైనా కార్యక్రమానికి హాజరవుతున్నారంటే పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో చాలా మందికి తెలియదు. ఒక ప్రజా ప్రతినిధి జనాల మధ్యకు వచ్చినప్పుడు ఆయన పాల్గొనే కార్యక్రమానికి కనీసం 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్నంతా పోలీసులు డామినేట్ చేస్తారు. అంటే, ఆ ప్రదేశంలో అల్లరిమూకలు, రౌడీషీటర్లు, ఉద్యమకారులు వంటి వారు ఎవరైనా అల్లర్లకు దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇలాంటిదేదీ ఆదివారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు పర్యటనలో కానరాలేదు. కనీసం ఒక్క పోలీస్ కూడా వీరి వెంట లేకపోవడం గమానార్హం. పోలీసులు వెంక రాకపోయినా, ఏరియాను డామినేట్ చేయకపోవడం వలనే భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చిందని తెలుస్తోంది. రామగుడ ఎన్‌కౌంటర్ తరువాత ఏఓబీలో మావోయిస్ట్‌ల ఉనికి లేకుండా చేశామని పోలీసులు రిలాక్స్ అయిపోయారు. మావోయిస్ట్‌లు ఎప్పటికైనా తెగబడతారన్న విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోపోవడం శోచనీయం. దీనికితోడు ఆదివారం కావడంతో పోలీస్ యంత్రాంగం కూడా రిలాక్స్ అయిపోయింది.
రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం
బలిమెల ఘటనలో సుమారు 30 మంది పోలీసులను మావోయిస్ట్‌లు బలితీసుకున్నారు. దానికి ప్రతీకారంగా పోలీసులు రామగుడ ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్ట్‌లను హతమార్చారు.
ఇక్కడి వరకూ ఒడిశా, ఛత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీస్ అధికారుల మధ్య సమన్వయం కొరవడిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్ట్‌లనేవారు లేకుండా చేయాలని కేంద్రం ప్రభుత్వం వ్యూహ రచన చేసింది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల మధ్య సరహిద్దు ప్రాంతాలకు కేంద్ర పోలీసు బలగాలను కూడా పంపించింది. ఏఓబీలో మావోయిస్ట్ కదలికలపై ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గడ్ ఎస్పీలు, డీఐజీలు, ఈ మూడు రాష్ట్రాల డీజీపీలు ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ వస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో దాన్ని మావోయిస్ట్‌లు అవకాశంగా తీసుకున్నారని తెలుస్తోంది.
రెండు రోజుల్లో డీజీపీ విశాఖ రాక
ఇదిలా ఉండగా లిప్టిపుట్టు ఘటనపై పోలీస్ బాస్ ఠాకూర్ వివరాలు సేకరిస్తున్నారు. ఆయన అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చినప్పుడు నేరుగా విశాఖకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈలోగా లిప్టుపుట్టు ఘటనపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేసే బాధ్యతను విశాఖ డీసీపీ ఫకీరప్పకు అప్పగించినట్టు తెలిసింది.

చిత్రం..నక్సల్స్ కాల్పుల్లో మరణించిన విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతదేహానికి
తలకొరివి పెడుతున్న అతని కుమారుడు శ్రావణ్