రాష్ట్రీయం

బతుకమ్మకు విశ్వఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: బతుకమ్మ పండుగకు విశ్వఖ్యాతి తీసుకువద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 9 న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ అక్టోబర్ 17 న సద్దుల బతుకమ్మతో పూర్తవుతుందన్నారు. ఈ పండగకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాజధానిలోని ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజాలలో పండగ వాతావరణం ఉట్టిపడేలా చూడాలని ఆదేశించారు. బతుకమ్మ పండగ సందర్భంగా పోలీసు శాఖ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, రహదారుల శాఖ బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, తాగునీటి సరఫరా చేయాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన మేరకు క్రేన్లను ఏర్పాటు చేయాలని, పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, లేజర్ షోలను ఏర్పాటు చేయాలని, ఫైర్‌వర్క్స్ ప్రత్యేకంగా ఉండేలా చూడాలని, ఫుడ్‌ఫెస్టివల్స్ ఏర్పాటు చేయాలని, ప్రధాన కూడళ్లలో విద్యుదీకరణ చేయాలని, బతుకమ్మ పోటీలు నిర్వహించాలని వివిధ శాఖల అధికారులకు జోషి సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ, బతుకమ్మకు ప్రాచుర్యం కల్పించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహకారం తీసుకోవాలని, ఎంబసీలు, కాన్సులేట్లతో సంప్రదించాలని సూచించారు. ఢిల్లీ, ముంబాయి తదితర నగరాల్లో హోర్డింగుల ద్వారా ప్రచారం నిర్వహిస్తామన్నారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం మాట్లాడుతూ, బతుకమ్మ పండగ మహిళలు, పూలు, ప్రకృతికి సంబంధించిన ఏకైక పండగ అన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు అంతర్జాతీయ విమానాశ్రయాలు, శతాబ్ది రైళ్లు ఇతర రైళ్లలో మహిళలకు బుక్‌లెట్స్ పంచుతామన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, దుబాయిలలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ల సహకారంతో బతుకమ్మ పండగ నిర్వహిస్తామన్నారు.
బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో పాల్గొనే మహిళలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హోటళ్లు, దుకాణాల, ఎస్టాబ్లిష్‌మెంట్లలో బతుకమ్మ నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.