రాష్ట్రీయం

తూతూ మంత్రం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆగిపోయిన కమిషన్ సర్వర్.. పనిచేయని బీఎల్‌ఓలు * తొలగని బోగస్ ఓట్లు
హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగుతోంది. గత 15 రోజుల నుంచి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ), రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి రజత్ కుమార్ చెబుతున్నా ఆచరణలో శూన్యమే. ఓటర్ల జాబితా సవరణకు మంగళవారం చివరి కావడం గమనార్హం. ఆఖరి రోజు కమిషన్ సర్వర్ పనిచేయలేదు. గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సర్వర్ స్వీకరించడం లేదని వివిధ ప్రాంతాల నుండి ‘మీసేవ’ నిర్వహకులు పేర్కొంటున్నారు. దాంతో చివరి క్షణంలో పేర్లను, ఇంటి నెంబర్లు తదితర అంశాల్లో సవరణలు చేసుకోవచ్చనుకున్నవారికి నిరాశే మిగిలింది. సీఈఓ ప్రకటించినట్టు బూత్‌లెవెల్ ఆఫీసర్లు 90 శాతం మంది శ్రద్ధగా పనిచేయలేదు. సవరణలకోసం ప్రయత్నించిన ప్రజలు తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
సీఈసీ ప్రకటించినట్టు సెప్టెంబర్ 10 ఓటర్ల జాబితా ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాజకీయ పార్టీలకు కూడా వీటిని వెంటనే అందించాల్సి ఉంది. కాని వాస్తవంగా మూడు, నాలుగు రోజుల తర్వాత ఈ జాబితాలను కమిషన్ వెల్లడించింది. దాంతో రాజకీయ పార్టీలు తమ నిరసనను స్థానిక అధికారులకు తెలియచేశాయి. వినాయకచవితి పండగ ఉత్సవాలు, పీర్లపండుగ ఉత్సవాలతో దాదాపు వారం, పదిరోజుల పాటు గడిచింది. ఈ పరిస్థితిలో సీఈసీ ప్రకటించిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌లో మార్పు చేయాలని టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. ఈ నెల 11 న రాష్ట్ర సచివాలయంలో వివిధ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల బృందం చర్చించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బిఎస్‌పీ తదితర పార్టీల ప్రతినిధులు దాదాపు ఒకే రకమైన డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ షెడ్యుల్‌ను మార్చాలని, సెప్టెంబర్ 25 తుదిగడువు కాకుండా దాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పార్టీల అభిప్రాయాలను సీఈసీ లెక్కలోకి తీసుకోలేదని స్పష్టమైంది. దాంతో అన్ని రాజకీయ పక్షాలు కూడా మండిపడుతున్నాయి.
టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు అనుకూలంగా ఉండే ఓటర్ల పేర్లలో ఎలాంటి మార్పు లేకపోయినా, ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటారన్న ఓటర్ల పేర్లను తొలిగించారన్న ఆరోపణలు వచ్చాయి. దాదాపు 30 లక్షల ఓటర్ల పేర్లను తొలిగించారని వివిధ పార్టీలు ఆరోపించాయి. మంగళవారం బీజేపీ రాజధాని నాయకులు పొన్నం వెంకటరమణ తదితరులు సీఈఓను కలిసి సమగ్రంగా లేఖ ఇచ్చారు. బిజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్‌లలో 1.30 లక్షల ఓట్లను తొలిగించారని, ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చార్మినార్, యాఖుత్‌పురా, మలక్‌పేట, కార్వాన్, నాంపల్లి, బహద్దుర్‌పురా, చాంద్రాయణ్‌గుట్టలల 1.20 లక్షల ఓట్లు కొత్తగా నమోదయ్యాయని, ఒకే ఓటర్‌కు రెండు అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని వారు ఉదాసహరణలతో సహా వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తరహా పరిస్థితి నెలకొని ఉంది.
ప్రైవేట్‌కు ఇస్తే ఎలా?
ఓటర్ల నమోదుకోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించే బాధ్యత ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని సీఈసీ నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ యంత్రాంగం ఉండగా, ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యత ఇస్తే తప్పులు జరిగేందుకు అవకాశం ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా బూత్‌లెవెల్ ఆఫీసర్లకు (బీఎల్‌ఓ) సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల, వారిపై నియంత్రణ లేకపోవడం పెద్దలోటుగా తేలుతోంది. ఇప్పటికైనా సీఈసీ జరిగిన తప్పులను సరిదిద్దుకుంటుందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.