రాష్ట్రీయం

దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమాను మావోయిస్ట్‌లు హతమార్చిన ఘటనపై పోలీసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనలోని లోపాలను ఓపక్క బేరీజు వేసుకుంటూనే మరోపక్క ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చురుకుగా ముందుకు కదులుతోంది. ఆదివారం మావోయిస్ట్‌లు సోమ, సర్వేశ్వరరావు వాహనాలను చుట్టుముట్టి వీరిద్దరినీ హతమార్చినప్పుడు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులను పోలీసులు ఇప్పటికే వివిధ ప్రదేశాల్లో ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన తీరును క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. అలాగే, పోలీసుల వద్ద ఉన్న మావోయిస్ట్‌ల ఫొటోలు చూపించి, అందులోని వారెవరైనా ఆదివారం నాటి ఘటనలో పాల్గొన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే, పోలీసులు ముగ్గురు మావోయిస్ట్‌ల ఫొటోలను సోమవారం విడుదల చేశారు. ఈ ముగ్గురు మావోలు రామగుడ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న వారిలో ఉన్నారు. అలాగే, హతుల వ్యక్తిగత వ్యవహారాలపై కూడా పోలీసులు ఆరాతీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి నివేదికను మూడు రోజుల్లో సిద్ధం చేయాలని డీజీపీ ఠాకూర్ ఆదేశించారు. దీంతో అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో కొన్ని పోలీసు బృందాలు దర్యాప్తు జరుపుతుండగా, విశాఖలోని బేస్ క్యాంప్‌కు కొంతమందిని తీసుకువచ్చి దర్యాప్తు విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా పట్టపగలు 60 మంది ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హతమార్చి తప్పించుకున్న మావోయిస్ట్‌ల కోసం పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. వీరు ఒడిశా లేదా ఛత్తీస్‌గడ్ వైపు పారిపోయారా? లేక డుంబ్రిగుడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా తలదాచుకున్నారా? అన్న అనుమానంతో ఈ ప్రాంతాలన్నీ పోలీసులు జల్లెడపడుతున్నారు. మరోపక్క ఒడిశా, ఛత్తీస్‌గడ్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. అవసరమైతే అదనపు బలగాలను కూడా కూంబింగ్‌కు పంపించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
నేడు డీజీపీ రాక?
ఇదిలా ఉండగా డీజీపీ ఠాకూర్ బుధవారం నగరానికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఆయన నేరుగా అరకు లేదా పాడేరుకు వెళ్లచ్చని భావిస్తున్నారు. ఆయన పర్యటనను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. డీజీపీ వచ్చే సమయానికి దర్యాప్తులో పురోగతి చూపించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 28న అమెరికా నుంచి తిరిగి వస్తారు. ఆయన ముందు మొత్తం నివేదిక ఉంచాలని కూడా యోచిస్తున్నారు.