రాష్ట్రీయం

నిరసన ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభా సమయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వృధా చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనిత, మీసాల గీత తదితరులు ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులలో రోజాను శాసనసభలోకి అనుమతించవలసిందిగా ఆదేశాలు లేవని, ఈ విషయం శాసనసభ వ్యవహారాలు చూసుకునే వారికి తెలియదా?, సభలో వైకాపా సభ్యులు ఎందుకు నిరసన తెలియచేస్తున్నారో వారికే తెలియదని అనిత విమర్శించారు. ఇప్పటివరకూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నిరసన తెలిపేవారని, ఇప్పుడు స్పీకర్ కుర్చీని కూడా చుట్టుముట్టడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు ఎలాగూ మారడని, కనీసం సభ్యుల్లోనైనా మార్పు రావాలని అనిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీకి ఓట్లు వేయలేదన్న కక్షతో సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారని గీత అన్నారు.
న్యాయస్థానాన్ని అగౌరవపరిచారు!
తెలుగుదేశం పార్టీ వారికి రాజ్యాంగంపట్ల, మహిళల పట్ల గౌరవం లేదని వైకాపా ఎమ్మెల్యే రాచపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. రోజాను తిరిగి సభలోకి తీసుకోవలసిందిగా న్యాయస్థానం చెప్పినా, దాన్ని అమలు చేయకుండా, కోర్టును అగౌరపరచిందని ఆయన అన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తున్నా, అధికారపక్షానికి బుద్ధి రావడం లేదని, తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని శివప్రసాదరెడ్డి అన్నారు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టు, ఒక్క మహిళను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన అధికార పార్టీ రాక్షసానందాన్ని పొందుతోందని ఆయన అన్నారు. రోజా సభలో ఉంటే అధికార పార్టీ సభ్యుల అవినీతి వెలుగులోకి వస్తుందన్న భయంతో ఆమెను సభ నుంచి బయటకు పంపించారని శివప్రసాదరెడ్డి అన్నారు.
మళ్లీ కోర్టుకు ఎందుకు వెళ్లారు?
కోర్టు తీర్పుమీద నమ్మకం లేని వాళ్లు మళ్లీ కోర్టుకు ఎందుకు వెళ్లారని వైకాపా శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు. ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగిందని, రాజ్యాంగ విరుద్ధంగా సస్పెన్షన్‌కు గురైందని భావించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందని అన్నారు. తమిళనాడు, కర్ణాటక తదితర అసెంబ్లీల నుంచి సభ్యులను సస్పెండ్ చేసినప్పుడు ఆయా రాష్ట్రాల హైకోర్టులు తప్పుపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు ధిక్కారానికి పాల్పడిన శాసనసభ వ్యవహారాలు చూసే అధికారులు కోర్టుకు సమాధానం చెప్పుకోవలసి వస్తుందని అన్నారు. ప్రతిపక్ష సభ్యుడు తమ పార్టీ సభ్యులకు అన్యాయం జరిగిందని చెప్పాలని ప్రయత్నిస్తే, మైకు ఇవ్వడం లేదని అన్నారు.
అప్పుడే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాల్సింది!
శాసనసభలో రోజా దళిత మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అప్పుడే ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సిందని మంత్రి పీతల సుజాత అన్నారు. ఆమెను సభ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడం అనేది చాలా చిన్న శిక్ష అని అన్నారు. తోటి మహిళ అని భావించి, ఆమెపై ఆరోజు కేసు పెట్టలేదని, ఇప్పుడు వారు మాపై ఎదురు దాడికి దిగుతున్నారని సుజాత అన్నారు. వివిధ రాష్ట్రాల్లో సభ్యులను ఒక ఏడాది నుంచి నాలుగు సంవత్సరాలపాటు సస్పెండ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రోజా వ్యాఖ్యలను బాధ్యతగల ఎవరు సమర్థించినా, తను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీలో అగ్లీ సీన్స్ క్రియేట్ చేస్తానని జగన్ ముందుగానే చెప్పారని అన్నారు. ఆయనకు చట్టసభలపై నమ్మకం లేదని అన్నారు. అప్రజాస్వామివాది అని అన్నారు. 12 కేసులలో జగన్ ముద్దాయిగా ఉండి, జైలు శిక్ష కూడా అనుభవించారని ఆయన అన్నారు. దొంగలు, దళిత వ్యతిరేకులు శాసనసభలో చేరి, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.