రాష్ట్రీయం

దేశమంతటా ప్రభుత్వ ఆసుపత్రులే ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 19: అభివృద్ధి రంగంలో భారతదేశం ఎలా పోటీపడి ముందుకు సాగుతోందో అంతకన్నా వేగంగా దేశ ప్రజలను అనారోగ్యం పట్టి పీడిస్తోందని ఇది ప్రమాదకర సంకేతాలని ఆర్‌ఎస్‌ఎస్ నేత డాక్టర్ ప్రవీణ్‌భాయ్ తొగాడియా హెచ్చరించారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, స్విమ్స్, పద్మావతి, ఎస్వీ మెడికల్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో 3ఆరోగ్యం-డాక్టర్లు-పాలకుల బాధ్యతలు2 అనే అంశాలపై స్థానిక మహతి ఆడిటోరియంలో రెండు రోజుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి మెడికోలు, ప్రొఫెసర్లు, వైద్య రంగంలోని పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈసందర్భంగా తొగాడియా మాట్లాడుతూ దారిద్య్రం, నిరుద్యోగం, 5జి, 6జి వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతోందని, అయితే ఏ ఒక్కరు కూడా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్న దాఖలాలు లేవన్నారు. దీంతో ఆరోగ్యంపై సామాన్యుల్లో కనీస పరిజ్ఞానం కూడా లేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో మరణాల సంఖ్య పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఛిన్నాభిన్నం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం దేశంలో ఏటా 236 మిలియన్ల డాలర్లు అంటే 14లక్షల కోట్ల రూపాయలు ఆరోగ్యంపై ప్రజల సొమ్ము ఖర్చు అవుతోందని అన్నారు. ప్రధానంగా బిపి, మధుమేహం, రక్తహీనత, క్యాన్సర్, గుండె జబ్బులతో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. మానసిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. గత 25 సంవత్సరాల్లో 2.5 కోట్లమంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. భారత దేశంలో ప్రభుత్వ వైద్యరంగం 29 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉందని లెక్కలు చూపుతున్నాయన్నారు.

మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 19: శాసనసభ మీడియా పాయింట్ వద్ద శనివారం కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నప్పుడు ఒక దినపత్రిక విలేఖరి పదేపదే వారిని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ ఆ విలేఖరిపై విరుచుకుపడ్డారు. పులివెందుల గూండాగా కనిపిస్తున్నావంటూ ఆ విలేఖరిని బోండా ఉమ అన్నారు. అలాగే గోరంట్ల కూడా తీవ్ర పదజాలంతో ఆ విలేఖరిపై విరుచుకుపడ్డారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.