ఆంధ్రప్రదేశ్‌

ఏపిఎస్ ఆర్టీసీకి 4 జాతీయ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆర్ధిక సంక్షోభం... దానికితోడు దశాబ్దాల తరబడి వెంటాడుతున్న నష్టాల నుంచి గడచిన ఏడాది కాలంగా బైటపడుతూ ఇప్పుడిప్పుడే కొద్దో గొప్పో లాభాల బాటలో పయనిస్తున్న ఎపిఎస్‌ఆర్టీసీ ఒకేదఫా ఎంతో ప్రతిష్ఠాకరమైన నాలుగు జాతీయ అవార్డులను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. జాతీయస్థాయిలో వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థల పనితీరుపై వివిధ కోణాల్లో అధ్యయనం చేసిన ‘అసోసియేట్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్ సంస్థ’ ప్రకటించిన నాలుగు జాతీయ అవార్డులను సోమవారం ఉదయం బెంగుళూరులోని హోటల్ లలిత్ అశోక్‌లో జరుగనున్న వేడుకల్లో సంస్థ వైస్‌చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ నండూరి సాంబశివరావు స్వయంగా అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ అవార్డుల వెనుక కార్మికుల అంకితభావం, సూపర్‌వైజర్, అధికారులు, సిబ్బంది అందరూ కలసికట్టుగా చేసిన కృషి దాగివున్నాయంటూ వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. దేశంలోని అన్ని రోడ్డు రవాణా సంస్థలన్నింటిలో చక్కని నైపుణ్యాలు ప్రదర్శించినందుకు గాను ఈ అవార్డులు లభించాయి. ఈ నాలుగు అవార్డులు కూడా ప్రథమ స్థానంలో పొందటం ప్రత్యేక విశేషంగా భావించవచ్చు. 2014-15 సంవత్సరంలో గ్రామీణ సర్వీసుల్లో రోజుకు సగటున ఒక్కో బస్సును 321 నుంచి 382 కిమీ నడపటం, కిలోమీటరుకు ఇంధన వ్యయం రూ.26.02పైసలు, సెక్రటేరియల్ రిబేట్ నందు గరిష్ట పెరుగుదల సాధించటం, ఇంధన వినియోగంలో అత్యధిక కెఎంపిఎల్ (5.23కిమీ) సాధించటం జరిగింది. అందుకే ఈ నాలుగు అంశాల్లో దేశంలోనే అత్యున్నత సామర్ధ్యాన్ని ప్రదర్శించినందుకు గాను ఎపిఎస్‌ఆర్టీసీ నాలుగు జాతీయ అవార్డులను అందుకోబోతున్నది.