రాష్ట్రీయం

నేత్రపర్వంగా.. వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 10: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంగారు తిరుచ్చిపై అల య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచ్చి వాహనం పై సర్వాలంకార భూషితుడైన స్వామివారిని భక్తులు దర్శించుకుని తన్మయులైయ్యారు. సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు స్వామివారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు రాత్రి 8 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనం (పెద్దశేష వాహనం)పై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతుల నడుమ, స్వర్ణ్భారణాలు, పుష్పాలను ధరించి, వేద పండితులు వేదాలను పటిస్తుండగా, భక్తుల గోవింద నామ స్మరణల మధ్య స్వామివారి వాహన సేవ భక్తులను పరవశింపజేసింది. నాలుగు మాడ వీధుల్లో కిక్కిరిసిన భక్తజనం తాము ఉన్న చోటు నుంచి స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి, అంజలి ఘటించి పరమానంద భరితులయ్యారు. ఈకార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ఇన్చార్జ్ సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, విఎస్‌ఓ రవీంద్రా రెడ్డి, అలయ డిప్యూటీ ఈ ఓ హరీంధ్రనాథ్, పేష్కార్లు రమేష్ బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.