రాష్ట్రీయం

వ్యవసాయం దండగన్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, అక్టోబర్ 10: వ్యవసాయం దండగని చెప్పిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు విదేశాల్లో ప్రకృతి సేద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని, ఇలా మాట్లాడటం ఆయనకే చెల్లుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గాజుల మండ్యం వద్ద ఉన్న ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు పరిస్థితి బజారునపడటం, రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారిందన్నారు. బాబు సమర్థుడనని 2014లో అధికారం అప్పగిస్తే తన సమర్థతతో రాష్ట్రాన్ని దోచుకోవడానికి, భూ కబ్జాకు పాల్పడేందుకు, రైతులను బజారున పడేసేందుకు, సహకార ఫ్యాక్టరీలను మూతవేసి తన వారికి దక్కేలా చేసేందుకు సర్వవిదాలా వినియోగిస్తున్నాడన్నారు. ఐదేళ్లు తనకు అధికారం ఇచ్చారు.. రాష్ట్రాన్ని దోచేసాను.. మరో ఐదేళ్లు అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని అమ్మేస్తాననే నినాదంతో ముందుకు వస్తున్న చంద్రబాబు నాయుడుని 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కలిసి తరిమేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమం త్రి రైతులు, డ్వాక్రా మహిళలకు మొండి చేయి చూపించారన్నారు. కిసాన్ మోర్చా రైతులకు అం డగా ఉంటుందని, ఎస్వీ చక్కెర కర్మాగారం తెరిచే వరకు బీజేపీ రైతులు, కార్మికులతో కలిసి నడుస్తుందని చెప్పారు. సీఎం మెడలు వంచైనా మూతపడ్డ కర్మాగారాలను తెరిపిస్తామన్నారు.