రాష్ట్రీయం

స్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో దసరా ఉత్సవాలు బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 9 గంటల నుండి దర్శన అవకాశం లభించినప్పటికీ తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లలో బారులుదీరారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతసేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యారచ్చనాదికాల అనంతరం ఉదయం 9 గంటల నుంచి శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. ఇదే సమయంలో ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజల నిమిత్తం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య మహామండపంలోకి తీసుకువచ్చారు. రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రోటక్షన్ ఫోర్స్ కమాండెంట్ డాక్టర్ కొండ నరసింహాసింగ్ దంపతులు 3 నిముషాల పాటు విరామం లేకుండా శంఖారావం పూరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి కోటేశ్వరమ్మ, ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబుల నేతృత్వంలో ఈ ఉత్సవాలు ప్రారంభమైయ్యాయి. తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆగమ శాస్త్రం ప్రకారం తితిదే పాలక వర్గ సభ్యులు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తమ కుటుంబ సమేతంగా తరలివచ్చి వెంకటేశ్వరస్వామి వారి పట్టుచీర, సారెను అమ్మవారికి సమర్పించారు. తొలిసారిగా శ్రీకాళహస్తి దేవాలయాధికారి శ్రీరామరామస్వామి తమ ఆలయం తరపున పట్టువస్త్రాలు దుర్గమ్మకు సమర్పించారు. అలాగే, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున చైర్మన్ వడ్లమూడి సురేంద్రబాబు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. నగర పోలీసు కమిషనర్ ద్వారక తిరుమలరావు, తమళినాడు తిరుమన్నామళైకు చెందిన అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివానందలహరి స్వామి అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టుచీర దుర్గమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ ముగ్గురికీ ఈవో కోటేశ్వరమ్మ ఆలయం తరపున పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని, వేద పండితుల ఆశీర్వాదాల్ని అందజేశారు. ఇదిలా ఉండగా మొదటి రోజు వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు నానా అగచాట్లకు గురైయ్యారు. సహజంగా వీఐపీలకు కేటాయించిన సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కాగా, తొలిరోజు ఉదయం 9 గంటల తర్వాత దర్శనానికి భక్తుల్ని అనుమతించడంతో ఈ సమయంలోనూ వీఐపీలకే ఆలయ అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో భక్తులు రాజగోపురం దగ్గర నిరసన తెలిపారు. కాగా శరన్నవరాత్రి మహోత్సవాల్లో దుర్గమ్మ గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణతో భక్తకోటికి దర్శనమివ్వనున్నారు.