ఆంధ్రప్రదేశ్‌

‘పిడి’కిలి బిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం శాసనసభలోని తన చాంబర్‌లో సిఎం ఇసుక విధానం అమలుపై రెవిన్యూ, మైనింగ్ పోలీసు శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి రెవిన్యూ డివిజన్‌లో రెవిన్యూ , మైనింగ్, పోలీసు అధికారులతో టాస్క్ఫోర్సు వేయాలని సిఎం కోరారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు అక్రమరవాణాకు కళ్లెం వేయాలని సూచించారు. అక్రమ రవాణాలో పట్టుబడితే ఇసుక లారీలను సీజ్ చేయాలని, ఇసుకను 15 రోజుల్లో వేలం వేయాలని, రెండో పర్యాయం అక్రమ రవాణాతో దొరికిపోతే వాహన యజమానులను పిడి యాక్ట్ కింద అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని, కాల్ సెంటర్లు నెలకోల్పాలని సూచించారుస. అక్రమ తవ్వకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డి.ఎస్పీ, ఆర్డీఓ బృందంతో ప్రతివారం ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని అన్నారు. పంచాయతీరాజ్ ఇఇ ర్యాంపుల నిర్మాణం, నిర్వహణకు చేపట్టాల్సి ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీలు పత్రికా సమావేశాలు నిర్వహించి ఉచిత ఇసుక విధానాన్ని వివరించాలని అన్నారు. ఇకపై తాను ప్రతివారం సమీక్ష నిర్వహిస్తానని, ఇసుక తవ్వకాల్లో అక్రమాలపై కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు కోరారు. ఇసుక విధానం అమలుపై ప్రతి మూడు రోజులకు ఒకసారి తనకు సమాచారం ఇవ్వాలని అధికారులను సిఎం కోరారు. ఇసుక తవ్వకం , అక్రమ రవాణాలో టిడిపి సహా ఏ పార్టీవారున్నా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు డిజిపి క్షేత్రస్థాయిలో చర్యలపై పర్యవేక్షించాలని సిఎం అన్నారు. ఐవిఆర్‌ఎస్ ద్వారా ప్రజల దగ్గర నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. ఉన్నతస్థాయి సమావేశంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, గనుల శాఖా మంత్రి పీతల సుజాత, డిజిపి జెవి రాముడు, సిఎం కార్యదర్శి జి సాయి ప్రసాద్, సిఎంఓ సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న, మైనింగ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.