రాష్ట్రీయం

చల్లగా చూడమ్మా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రాన్ని చల్లగా చూడమ్మా.. అని బెజవాడ కనకదుర్గ అమ్మవారిని ప్రార్థించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి సాధించాలని వేడుకున్నట్లు చెప్పారు. దసరా మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజు ఆదివారం కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి చైర్మన్ గౌరంగబాబు, ఈవో కోటేశ్వరమ్మ, వేదపండితులు ఆలయం వద్ద ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రచురించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలని, రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని వేడుకున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మేలైన జీవనం ఇవ్వమని కోరినట్లు తెలిపారు. వర్షాలు కురిపించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రార్థించానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, అన్ని నదులు అనుసంధానం కావాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా అమ్మవారు కాపాడాలన్నారు. అమరావతి అభివృద్ధి జరగాలని కోరానని తెలిపారు. నాలెడ్జిలో, నైపుణ్యంలో యువత అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో సంపద సృష్టించాలని కోరుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో చేసే అభివృద్ధి పనులను ఆశీర్వదించి సఫలీకృతం అయ్యేందుకు అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని, భవిష్యత్తులో కూడా ప్రజలపై దుర్గమ్మ కరుణాకటాక్షాలు ప్రసరించాలని వేడుకున్నానన్నారు. దుర్గమ్మకు ప్రభుత్వ లాంఛనాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. అమ్మవారిని మూలా నక్షత్రం రోజు దర్శించుకోవడం వల్ల శాంతి, సౌభాగ్యాలు ఇస్తుందన్నారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. గత ఏడాది తొలి ఐదురోజుల్లో అమ్మవారిని 2.97 లక్షల మంది దర్శించుకుకోగా, ఈ ఏడాది 5.23 లక్షల మంది దర్శించుకున్నారని ఆయన తెలిపారు. దేవస్థానం, జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు రెండు రోజులు ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దుర్గగుడి సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. అనేక ఉత్సవాలు నిర్వహించడం వల్ల దేవస్థానం ఆదాయం పెరుగుతోందన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టీటీడీకి 10వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా, కనకదుర్గ ఆలయానికి 108 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తోందన్నారు. అందులో 86కోట్ల రూపాయలు భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులకు ఖర్చవుతోందని చెప్పారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లకు 8కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. విజయవాడను ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చే మార్చి నాటికి పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. కాంట్రాక్టరు పనుల్లో జాప్యం చేయకుండా ఉండేందుకు 10కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా పాల్గొన్నారు.