రాష్ట్రీయం

అంతటా హస్తం హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ అంతటా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని టీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ గాలికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావువణికి పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పీఆర్‌టీయు వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బీ మోహన్ రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు సత్యనారాయణ ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. భీమ్ భారత్ చొరవతో పలువురు మాజీ మావోయిస్టులు పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ వారిద్దరికీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ‘ఇది అందరికీ పరీక్షా సమయం’ అన్నారు. 53 రోజుల్లో తెలంగాణ భవిష్యత్ తేలిపోతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆరు శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దోపిడీ చేసిన సొమ్ముతో ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్లిళూరుతున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. జనంలో వ్యతిరేకత వస్తున్నందునే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ కుమ్మక్కై ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీనీ నిలబెట్టుకోలేదని, పైగా ఇప్పుడు అలా అనలేదని మాట మారుస్తున్నారని పీసీసీ చీఫ్ దుయ్యబట్టారు. తాము టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రా పార్టీతో పొత్తా? అని ప్రశ్నిస్తున్నారన్న ఉత్తమ్ ‘రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీతో 2009 ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడలేదా?’అని నిలదీశారు. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటే తమకు ఇబ్బంది ఏమీ ఉండదన్నారని, ఇప్పుడేమో వణికి పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు, పీ మహేందర్ రెడ్డి ఏ ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ చీఫ్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న ఈ నాలుగున్నరేళ్ళలో ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదని, టీచర్స్-డేకు కేసీఆర్ హాజరుకాలేదని ఆయన విమర్శించారు.