ఆంధ్రప్రదేశ్‌

రోజాకు మరో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటు అసెంబ్లీలో అటు కోర్టులో కూడా సస్పెన్షన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. సభా హక్కుల కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల చేసిన సిఫార్సులను నాలుగు గంటల చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మరో పక్క జరిగిన దానికి వైకాపా ఎమ్మెల్యే క్షమాపణ చెబితే సభలోకి అనుమతిస్తామని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే..తమ క్లయింట్ తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెబుతారని రోజా తరపు న్యాయవాది వాదించడంతో ఈ వ్యవహారంపై కోర్టు నిర్ణయం మంగళవారానికి వాయిదా పడింది. మళ్లీ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో పాలకపక్షం, బిజెపి సభ్యులే రోజా వ్యవహారంలో నిర్ణయం తీసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యేపై కఠిన చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబట్టిన మెజార్టీ సభ్యులు కమిటీ ముందు క్షమాపణ చెప్పినందున వైకాపా ఎమ్మెల్యేలైన జ్యోతుల నెహ్రు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డి, కొడాలి నానిలను మందలించి వదిలేయాలని సూచించారు. సుమారు 4 గంటల పాటు చర్చ జరిగిన అనంతరం మాట్లాడిన అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ‘సభలో వ్యక్తమైన అభిప్రాయాల మేరకు ప్రివివేజస్ కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇస్తున్నాం’అని తెలిపారు. ఆమె కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చే పక్షంలో వాటి ఆధారంగా కమిటీ చేసే సిఫార్సులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొడాలి నానిపై చర్యను సభ నిర్ణయిస్తుందని, అయితే జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డిల క్షమాపణలను అంగీకరిస్తున్నామని వెల్లడించారు.
సర్వాధికారాలు స్పీకర్‌కే..
ఇలాంటి వ్యవహారాల్లో సర్వాధికారాలు స్పీకర్‌కే ఉన్నాయని, ఏ నిబంధన కిందైనా సభాపతి నిర్ణయం తీసుకోవచ్చని యనమల తెలిపారు. సభ నిబంధనల కంటే కూడా సభ నిర్ణయమే ముఖ్యమన్నారు. సభ నుంచి ఎవరినైనా సస్పెండ్ చేయాలనుకుంటే ఇనే్న రోజులు చేయాలన్న నియమం ఏమీ లేదని, సభ తీర్మానం చేస్తే ఎన్ని రోజులైనా సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉందని గతంలో జరిగిన రాజనారాయణ్ కేసులో స్పష్టమైందని అన్నారు. కోర్టును చట్ట సభలు గౌరవించాలని, కోర్టులు కూడా చట్ట సభలను గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాద రావు మాట్లాడుతూ ఇది సంతోషకరమైన చర్చ కాదన్నారు. హక్కుల కమిటీ సిఫార్సులపై చర్చించేందుకు వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. సాధారణంగా ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు పశ్చాత్తాపం చెప్పడం, సభలో ఉపసంహరించుకోవడం, క్షమాపణ చెప్పడం, లేదా రాజీమార్గాన్ని అనుసరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ‘సాక్షి’ ఛానల్ చేసిన తప్పుకు నోటీసు పంపించడం జరిగిందని, దీంతో వారు వెంటనే తప్పును సరిదిద్దుకుంటామని, క్షమించాలని లేఖ పంపడం మంచి సంప్రదాయమని అన్నారు.
రోజాను క్షమించొద్దు
అంతకు ముందు ప్రభుత్వ విప్ యామిని బాల మాట్లాడుతూ చేసిన తప్పుకు రోజా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. టిడిపి ఎమ్మెల్యే ఆనంద రావు మాట్లాడుతూ రోజా అసెంబ్లీ బయట దీక్ష చేస్తూ స్పృహ కోల్పోయినట్లు నటించారని విమర్శించారు. టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలు బరితెగించారని విమర్శించారు. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార రాజు మాట్లాడుతూ కొడాలి నాని క్షమాపణ చెప్పినందున క్షమాబిక్ష పెట్టాలని కోరారు. ప్రతిపక్ష నేత జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే వైకాపా ఎమ్మెల్యేలను సిఎం సీటు వైపు పంపించారని విమర్శించారు. టిడిపి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ క్షమాపణ చెప్పిన వైకాపా ఎమ్మెల్యేలను వదిలి వేయాలని సూచించారు. టిడిపి సభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 122, 212, 194ప్రకారం సభ్యులకు స్వేచ్ఛ, అధికారం ఉందని అన్నారు. రోజాలో పశ్చాత్తాపం లేదని పైగా ‘నన్ను ఏమి చేస్తారు?, రేప్ చేస్తారా లేక మర్డర్ చేస్తారా?’ అని అన్నారని ఆయన చెప్పారు. టిడిపి ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ రోజాలో ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. రోజా క్షమాపణ చెప్పినా, కఠినమైన శిక్ష వేసినా తనకు అయిన గాయం మానదని ఆమె తెలిపారు.
ముగిసిన వాదనలు
వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఎపి అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ధర్మాసనం ముందు సోమవారం వాదనలు ముగిశాయి. అనంతరం ఈ కేసు తీర్పును మంగళవారం నాటికి రాజ్యాంగ ధర్మాసనం వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. క్షమాపణ చెబితే సభ్యురాలిని సభలోకి అనుమతిస్తామని కోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది పి వి రావు నివేదిక అందించారు. పిటిషనర్ తప్పు చేయలేదు గనుక క్షమాపణ చెప్పేది లేదని రోజా తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వీలుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే , జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన బెంచ్ ముందు ఎపి ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి పి రావు తన వాదనలు వినిపించారు. శాసనసభ ఇచ్చిన ఆదేశాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు సహా పలు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. 340వ నిబంధన కింద శాసనసభ ఏడాది పాటు సస్పెండ్ చేసే అంశాన్ని సవరించుకునే వీలు తిరిగి శాసనసభకు 194(3) నిబంధన కింద ఉందని చెప్పారు. అదే రోజు సభ్యురాలు సభకు క్షమాపణ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని న్యాయవ్యవస్థ-శాసన వ్యవస్థల మధ్య యుద్ధలా పరిగణిస్తోందని అన్నారు. తీర్మానం ఆమోదించే ముందు సభ్యురాలికి సభ అవకాశం ఇవ్వలేదని అన్నారు. శాసనసభ చేసిన తప్పులను న్యాయవ్యవస్థ సరిచేయలేదని, సభ చేయాలని అన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సభ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 66 మంది శాసనసభ్యులు పోడియం వద్దకు దూసుకువచ్చినపుడు కేవలం ఒకే ఒక్క శాసనసభ్యురాలిని ఏడాది పాటు సస్పెండ్ చేయడం కక్షసాధింపు చర్యేనని అన్నారు. కేసు పూర్వపరాలలోకి వెళ్లకుండా ఫిర్యాదుదారు విజ్ఞాపన అంశానే్న పరిశీలిస్తామని పేర్కొన్నారు.
పిల్ స్వీకారం
రోజాకు అనుకూలంగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , శాసనసభ అమలుచేయకపోవడంపై హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు సోమవారం నాడు స్వీకరించింది.
chitram...
అసెంబ్లీలో సోమవారం తీర్మానం ప్రవేశపెడుతున్న యనమల