రాష్ట్రీయం

దసరాకు వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ఎన్నికల మేనిఫెస్టోలోని వరాలను దసరా కానుకగా ముందే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశం కాబోతుంది. సమావేశానికి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరవుతారు. కమిటీతో చర్చించిన తరువాత కేసీఆరే స్వయంగా వరాలను ప్రకటిస్తారు. మేనిఫెస్టో కమిటీ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నట్టు కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావువెల్లడించారు. అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తుండటంతో మేనిఫెస్టోలో ఇచ్చే హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉందని పార్టీ భావిస్తున్నట్టు కేకే తెలిపారు. పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోగా ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలను ప్రకటించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. మంగళవారం జరిగే కమిటీతో చర్చించాక పాక్షిక మేనిఫెస్టోను కేసీఆర్ స్వయంగా ప్రకటిస్తారని ఆయన చెప్పారు. ఇలా ఉండగా టీఆర్‌ఎస్ పాక్షికంగా ప్రకటించబోయే ముఖ్యమైన హామీలలో నిరుద్యోగ భృతి, పంట రుణ మాఫీ, ఆసరా పెన్షన్ల మొత్తం పెంపు తదితర అంశాలు ఉంటాయని సమాచారం. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లోని మూడు అంశాలలో నియామకాలు ఒకటి. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. అయితే జోనల్ వ్యవస్థ రద్దు చేయాలా? వద్దా? అనే మీమాంసా, న్యాయపరమైన చిక్కులు తదితర కారణాల వల్ల 34 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయగలిగింది. 80 వేలకు పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రక్రియ
ముందుకుసాగలేదు. దీంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారన్న విషయం వాస్తవమేనని పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. వీరిలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేయడానికి వచ్చే ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగ భృతిని చేర్చాలని టీఆర్‌ఎస్ నిర్ణయించినట్టు సమాచారం. అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మూడు వర్గాలు విభజించి నిరుద్యోగ భృతి చెల్లించనున్నట్టు హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రైతులకు పంట రుణ మాఫీ చేసింది. అయితే ఇది ఒకే దఫా చేయకుండా నాలుగు విడతల్లో ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు అమలు చేసింది. ఒకేసారి చెల్లించకపోవడం, రుణ మాఫీకి సంబంధించిన వడ్డీ కూడా చెల్లిస్తామని ప్రకటించినా అమలు చేయకపోవడాన్ని విపక్షాలు ఎత్తిచూపాయి. తాము అధికారంలోకి వస్తే ఒకేదఫా రెండు లక్షల రూపాయల పంట రుణాన్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటించిన 2 లక్షల రుణ మాఫీ పట్ల రైతాంగం మొగ్గు చూపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. దీంతో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా తాము కూడా రెండు లక్షల వరకు రుణ మాఫీని ఒకేసారి చేయనున్నట్టు హామీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ యోచిస్తోంది. ఈ అంశాన్ని కూడా పాక్షిక మేనిఫెస్టో విడుదలలో అధినేత ప్రకటిస్తారని తెలిసింది. ఆసరా పెన్షన్ పథకంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు వెయ్యి రూపాయాలు, దివ్యాంగులకు 15 వందలు ప్రస్తుతం చెల్లిస్తుంది. మరోపక్క పెన్షన్ల మొత్తాన్ని రెండు వేలకు పెంచనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించి ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. పెన్షన్లను పెంచుతామన్న హామీ ఇచ్చే అవకాశం ఉంది.