రాష్ట్రీయం

కాంట్రాక్టర్లకు కట్టుబానిస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకాంట్రాక్టర్లకు కట్టుబానిసగా మారారని కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటూ కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మగా మారారని విరుచుకుపడ్డారు. జైపాల్‌రెడ్డి సోమవారం గాంధీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ‘తెలంగాణ నిధులన్నీ ఆంధ్ర సంస్థలకే దోచి పెడుతున్నారు’అని తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క కాళేశ్వరంలోనే ఒకే కంపెనీకి రూ.27,407 కోట్లు, సాగు నీటి రంగానికి సంబంధించి కొన్ని పనులను మరో కంపెనీకి రూ.17 వేల కోట్లకు పనులు అప్పగించారని ఆయన తెలిపారు. ఇలా ఆ రెండు కంపెనీలకు సుమారు రూ.77 వేల కోట్ల విలువ చేసే పనులు ధారాదత్తం చేశారని జైపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ కంపెనీలు తెలంగాణ పాలిట ఈస్టిండియా కంపెనీగా మారాయని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ కంపెనీ చేతుల్లో కీలుబొమ్మలా మారిందని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్ల కోసమే నీటి పారుదల ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపించారు.
నా లెక్కలు తప్పు అని నిరూపించగలరా?
తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపించగలరా? అని జైపాల్ రెడ్డి అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్లు కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎక్కడ ఆపామో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిని సమూలంగా నిర్మూలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల సమాచారం ఎవరికీ దొరకకుండా ఫైళ్ళను దాచి పెట్టారని జైపాల్ విమర్శించారు. ఆ కంపెనీలను అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ టీడీపీకి అమ్ముడు పోయారని టీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎవరికి ఎవరు అమ్ముడుపోరని ఆయన తెలిపారు. గతంలో టీడీపీతో కలిసి మీరు పోటీ చేయలేదా? అని జైపాల్ రెడ్డి టీఆర్‌ఎస్ నేతలను నిలదీశారు.

చిత్రం.. గాంధీ భవన్‌లో మాట్లాడుతున్న జైపాల్ రెడ్డి