రాష్ట్రీయం

రాములు నాయక్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసమ్మతి నేతలపై టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి కొరడా జులిపించింది. శాసనమండలి సభ్యుడు రాములు నాయక్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించి అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నారాయఖేడ్ నుంచి పోటీకి రాములు నాయక్ టిక్కెట్‌ను ఆశించారు. అయితే నారాయణఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే వచ్చే ఎన్నికలకు అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైన రాములు నాయక్ తన సామాజిక వర్గానికి చెందిన యువకులు, ఉద్యోగులు, మేధావి వర్గాలతో వరుస భేటీలు జరిపారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించినప్పటికీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో అధినాయకత్వాన్ని బహిరంగంగానే విమర్శించారు. రాములను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఎట్టిపరిస్థితుల్లో పోటీచేయాలని, టీఆర్‌ఎస్‌ని ఓడించాలని నాయక్ సామాజిక వర్గానికి చెందిన నేతలు వత్తిడి తెచ్చారు. దీంతో కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ కుంతియాతో రాములు నాయక్ భేటీ జరిపినట్టు టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన రోజు కాంగ్రెస్‌లో చేరికకు రాములు నాయక్ సిద్ధమైనట్టు సమాచారం బయటికి పొక్కడంతో ఈ చర్య తీసుకున్నారు.