రాష్ట్రీయం

సరస్వతీ మాతగా భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 15: వరంగల్ మహానగరంలోని శ్రీ్భద్రకాళి దేవస్థానంలో శరనవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు సోమవారానికి 6వ రోజుకు చేరుకున్నాయి. సరస్వతీ మాతగా భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4గంటలకు ప్రారంభమైన ఆలయ నిత్యాహ్నికం ప్రాతఃకాల పూజ కాగానే అమ్మవారికి నవరాత్రి విశేష సేవలు ప్రారంభమైనాయి. ఆరవ రోజు శరనవరాత్ర కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని సరస్వతీ మాతాగా అలంకరించి చతుస్ధానార్చన జరిపారు. ఉత్సవ నిర్వహణలో భాగంగా వరాహ పురాణాంతర్గత ఈత నవదుర్గా క్రమాన్ని అనుసరించి కాత్యాయని దుర్గా క్రమంలో మరియు సాయంత్ర బోధాయన ప్రోక్తఆగమోక్త నవదుర్గా క్రమాన్ని అనుసరించి రక్తబీజహ దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధనలు జరిపారు. భద్రకాళీ అమ్మవారి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ కుటుంబసమేతంగా వచ్చి దర్శించుకున్నారు. సరస్వతి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని సేవించడం వల్ల అమ్మవారు ఆవిద్యను దూరం చేసి సకల విద్యను ప్రసాదించడమేకాక మోక్షాన్ని పొందడానికి కావల్సిన శుద్ధాత్మ విజ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తుందని అనడానికి ప్రతీకగా అమ్మవారిని సరస్వతీ మాతగా అలంకరించారు. అమ్మవారికి గంధోత్సవం నిర్వహించి సాలభంజికసేవపై ఊరేగించారు.