రాష్ట్రీయం

సకల జనుల సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 15: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం గజ్వేల్‌లో ఆర్యవైశ్యులు, కార్మికులు, ఆర్‌ఎంపీ, పీఎంపీలు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు, గౌడ సంఘం ప్రతినిదులు, వైద్యులు, క్రైస్తవులు, మైనార్టీలతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. రైతులు, పేదలు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, యువకులు తదితర వర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి ఆదరించాలని కోరారు. తాగునీరు, సాగునీరు, విద్యా, రైల్వేలైన్, ప్రాజెక్టుల నిర్మాణం, రింగ్‌రోడ్డు ఏర్పాటు, ఎడ్యుకేషన్‌హబ్, ఆడిటోరియం, డబల్‌బెడ్‌రూం ఇళ్లు, సమీకృత ప్రభుత్వ భవనాల నిర్మాణం, 100 పడకల ఆసుపత్రి తదితర ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి కాగా, పేదల సంక్షేమానికి సైతం పెద్దపీట వేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని తెలిపారు. గజ్వేల్ ప్రజల గౌరవం కాపాడిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి ప్రతిష్ట పెంచాలని, సకలజనుల సంక్షేమంలో ముందుండి శ్రమించిన టీఆర్‌ఎస్‌ను ఆదరించి ఆశీర్వదించాలని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష కూటమిని దరిచేర్చుకోవద్దని, వారికి అండగా నిలిస్తే తిరిగి సమస్యలు తీవ్రరూపం దాల్చి గత కష్టాలను కొనితెచ్చుకున్నట్లవుతుందని అన్నారు. గజ్వేల్
నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా సాగుతుండగా, అదే ఊపును కొనసాగించాల్సిన బాద్యత ప్రజలపై ఉందని వివరించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి మాటలను నమ్మవద్దని అన్నారు. అమలుకు సాద్యంకాని మేనిఫెస్టోను ప్రకటిస్తున్న కాంగ్రెస్ గతంలో ఎందుకు చేయలేకపోయిందని విమర్శించారు. కార్పొరేషన్ చైర్మన్‌లు పన్యాల భూపతిరెడ్డి, తూంకుంట నర్సారెడ్డి, మడుపు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి హరీష్‌రావు