రాష్ట్రీయం

ఎన్ని ఫ్రంట్‌లొచ్చినా బీజేపీదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలు, కూటమీలు ఏకమైనా అధికారంలోకి వచ్చేది బీజేపీ సర్కారేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి జేపీ నడ్డా అన్నారు. సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ,
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 2 లక్షల కోట్లకు పైగా ఆర్థికసాయాన్ని వివిధ పద్దుల కింద ఇచ్చిందన్నారు. అయితే వీటిని ఇంతవరకు ఏమి చేసిందో చెప్పాలేదన్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభల్లో ఈ నిధులను ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు. అయితే ఒకే రాష్ట్రంలో రెండు సార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలభారం, వారికి ఇబ్బందికరమన్నారు. జమిలీ ఎన్నికలపై రాష్ట్రాల అభిప్రాయం కోరగా, అప్పుడు సుముఖత వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్ ఆకస్మత్తుగా ముందస్తుకు వెళ్లడానికి సహేతకమైన కారణం చూపలేదన్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే నరేంద్ర మోదీ ప్రాభవాన్ని తట్టుకోలేమనే ముందస్తు ఎన్నికలకు వెళ్లిందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన కీలకమైన వాగ్దానాలను నెరవేర్చలేదని నడ్డా విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా వినియోగించుకోలేదన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల అమలులో ఎన్నో అనుమానాలు వ్యక్తమైనా ప్రభుత్వం వాటిని నివృత్తి చేయలేకపోయిందన్నారు. ఎన్నికల వ్యవహారాన్ని ఇంతగా రాద్ధాంతం ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఓటర్ల జాబితాలో కొన్ని సవరణలు చేయాలని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు సామాన్యుడి జీవితంలో వెలుగు రేఖలు నింపాయన్నారు. మహిళలు, రైతుల సంక్షేమానికి, యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. బీజేపీ పాలపై దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకోస్తే మంచి పాలన అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో రెండు విభిన్న రాజకీయ పక్షాలు అవకాశవాద రాజకీయాల కోసం ఏకమయ్యాని నడ్డా విమర్శించారు. బీజేపీ కార్యశీలంగా వ్యవహరిస్తుందన్నారు. పాజిటీవ్ ఓటుపైనే ఆధారపడిందన్నారు.

చిత్రం.. బీజేపీ ఆఫీసులో మాట్లాడుతున్న కేంద్రమంత్రి జేపీ నడ్డా