రాష్ట్రీయం

కాత్యాయని అలంకారంలో భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం అక్టోబర్ 15: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమవారం భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు హంస వాహనసేవ నిర్వహించారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. నవదుర్గ అలంకారాల్లో భాగంగా సోమవారం ఉదయం భ్రమరాంబిక ఉత్సవమూర్తిని కాత్యాయని స్వరూపంలో అలంకరింపజేశారు. ఈ దేవి చతుర్భుజాలు కలిగి ఉంటుంది. కుడివైపున అభయహస్తం, వరదముద్ర, ఎడమవైపు పద్మం, ఖడ్గం ధరించి ఉంటుంది. కాత్యాయనీదేవిని ఆరాధించడం వల్ల రోగ, శోఖ భయాలను తొలగించుకోవచ్చు. శ్రీకృష్ణుడిని భర్తగా పొందేందుకు గోపికలు ఈ అమ్మవారినే పూజించారట. కాత్యాయని ఆరాధన వల్ల జన్మజన్మల పాపాలన్నీ హరించుకుపోతాయని పురాణాల్లో ఉంది. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి హంస వాహనంపై ఆశీనులను చేయించి ప్రత్యేక పూజలు హారతులు ఇచ్చారు. రాత్రి ప్రత్యేక పూజల అనంతరం గ్రామోత్సవం కన్నులపండువగా జరిగింది. హంస వాహనంపై ఆశీనులైన ఆది దంపతుల గ్రామోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. గ్రామోత్సవం ముందుభాగంగా ఏర్పాటుచేసిన వివిధ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.