రాష్ట్రీయం

నేషనల్ మెమొరీ అవార్డుకు రూ.3 లక్షల నగదు బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ఈత, బాక్సింగ్, పుట్ బాల్, క్రికెట్, భౌతిక క్రీడల పోటీలు జరుగుతుంటాయి కానీ, మెదడుకు సంబంధించి వ్యాయామాలు ఉండాలన్న భావనతో వరల్డ్ మెమొరీ కౌన్సిల్ ఈ తరహా పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే 9వ ‘ది ఇండియన్ నేషనల్ మెమొరీ ఛాంపియన్ 2018’ పోటీలను ఆదివారం నిర్వహించింది. నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విజేతకు ‘ది ఇండియన్ నేషనల్ మెమొరీ ఛాంపియన్-2018’ టైటిల్‌తో పాటు రూ.3 లక్షల నగదు బహుమతి అందించడం జరిగింది. మొదటి రన్నర్‌కు ట్రోఫీ, సర్ట్ఫికేట్, రూ.2 లక్షల నగదు, రెండవ రన్నర్‌కు ట్రోఫీ, లక్ష రూపాయల నగదు బహుమతి అందజేశారు. ప్రతి కేటగిరిలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, మొదటి రన్నర్‌కు రూ.30 వేలు, రెండవ రన్నర్‌కు రూ.20 వేలు నగదు బహుమతి అందించారు. ఈ పోటీలు వరల్డ్ మెమొరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, ప్రెసిడెంట్ స్క్వాడ్రన్ లీడర్ జయసింహ అధ్వర్యంలో జరిగాయి. అంతర్జాతీయ పరిశీలకుడు వరల్డ్ మెమొరీ స్పోర్ట్స్ కౌన్సిల్ చీఫ్ ఆర్బిట్రేటర్ ఫిలిప్ ఛాంబర్, భారతీయ పరిశీలకులుగా జెఎస్‌పీ రాజ్, పవన్ భట్టాడ్ పర్యవేక్షించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 250 మందికి పైగా మెమొరీ అథ్లెట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు.