రాష్ట్రీయం

సహాయక చర్యలు మరింత వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తుపాను సహాయక చర్యలు మరింత వేగవంతం కావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సహాయక చర్యలు మెరుగుపడ్డాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్ నుండి సోమవారం రాత్రి తుపాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండు రోజుల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం కావాలన్నారు. తాను మంగళవారం శ్రీకాకుళం వస్తున్నానని, అప్పటికల్లా పరిస్థితులు మెరుగుపడాలని ఆదేశించారు. 356 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారని, మరో 80 జనరేటర్లు తరలించనున్నారని తెలిపారు. 377 తాగునీటి స్కీమ్‌ల్లో 273 పని చేస్తున్నాయన్నారు. మిగిలినవాటిని కూడా పునరుద్ధరించాలన్నారు. 28 వేల విద్యుత్ స్తంభాలు ఇప్పటికే చేరుకున్నాయని, 15 వేల విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించారన్నారు. మిగిలిన వాటిని కూడా చేపట్టాలన్నారు. 43 శాతం గ్రామాల్లో, 36 శాతం ఆవాసాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారన్నారు. విద్యుత్ పనులు మరింత ఊపు అందుకోవాలని కోరారు. సామగ్రి, కార్మికులు అందుబాటులో ఉన్నారని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం మధ్యాహ్నానికి నిత్యావసర సరకుల సరఫరా పూర్తి కావాలని స్పష్టం చేశారు. బియ్యం పంపిణీ 70.8 శాతం, కందిపప్పు, చక్కెర 60 శాతం, పూర్తి అయిందన్నారు. వజ్రపుకొత్తూరు, మందసలో నిత్యావసరాల సరఫరా వేగవంతం చేయాలన్నారు. భోజనం పంపిణీలో ప్రజల్లో సంతృప్తి 4 శాతం పెరిగిందన్నారు. మంచినీటి సరఫరాపై 5 శాతం, రాకపోకల ఏర్పాట్లపై 9.11 శాతం, విద్యుత్ సరఫరాపై 4.3 శాతం పెరిగిందన్నారు. పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని, ఇప్పటి వరకూ 63 వేల హెక్టార్లలో సర్వే జరిగిందన్నారు. 37 మంది శాస్తవ్రేత్తలు 109 గ్రామాల్లో పర్యటించారని, పత్తి, చెరకు, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారన్నారు. పంటపొలాల్లోని నీటిని బయటకు పంపాలన్నారు. బీమా చెల్లించేలా ఆయా కంపెనీలతో చర్చించాలన్నారు. మండలాలు, క్లస్టర్ల వారీగా కూడా సీఎం సమీక్షించారు. పలాస, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, వజ్రపుకొత్తూరు ప్రాంతాల్లోని పరిస్థితులపై సీఎం సమీక్షించారు. అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరగాలని, బియ్యం, సరకులు అందాయో? లేదో? విచారించాలన్నారు. మంచినీరు, విద్యుత్ సరఫరా పర్యవేక్షించాలన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్లౌడ్ సోర్సింగ్ ఉపయోగించాలని, ఇళ్లు, పంటలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు.
చిత్రం..టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు