రాష్ట్రీయం

బహిరంగ చర్చకు సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: సాగునీటి ప్రాజెక్టులు, టెండర్ల ఖరారుపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఈపీసీ పద్ధతిలో జలయాజ్ఞన్ని ధనయజ్ఞంగా మార్చింది కాంగ్రెస్ కాదా? అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేస్‌లో వెనుకబడిపోయానన్న బాధతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో లక్ష యాభై వేల కాంట్రాక్టులు ఖరారు చేస్తే అందులో తెలంగాణవారు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 9 కంపెనీలను మాత్రమే ఎంపిక చేసి వాటినే టెండర్లలో పాల్గొనేలా చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆన్‌లైన్ విధానంలో ఏ కంపెనీ తక్కువ కోట్ చేస్తే వారికే కాంట్రాక్టులు దక్కుతాయన్న విషయం జైపాల్‌రెడ్డికి తెలియకపోవడం విచారకరమన్నారు. జైపాల్‌రెడ్డి విమర్శలు
చూస్తుంటే ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు’గా ఉందని మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 4 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే తాము కేవలం నాలుగేళ్లలో 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని హరీశ్‌రావు గుర్తుచేసారు. జైపాల్‌రెడ్డి చేసిన ఆరోపణలు ప్రతిదానికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధమని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా, మహబూబ్‌నగర్ ఎంపీగా ఆయన ఒరుగబెట్టింది ఏమీ లేదని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.