రాష్ట్రీయం

ఇదీ ఎన్నికల నియమావళి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఎన్నికల మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
సాధారణ నియమాలు..అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు కుల, మత, భాషా విద్వేషాలను రెచ్చగొట్టకూడదు. విధానాలు, పథకాలపైనే విమర్శలు ఉండాలి. వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయకూడదు.
కుల, మతప్రాదికపై ఓట్లు అడగకూడదు. మందిరాలు, మసీదులు, చర్చీలు తదితర ప్రార్థనా ప్రదేశాలను ఎన్నికల ప్రచారం కోసం వాడకూడదు.
ఓటు కొరకు డబ్బు ఇవ్వడం, బెదిరించడం చేయకూడదు. ఒకరి పేరుతో ఉన్న ఓటును మరొకరు వేయకూడదు.
వ్యక్తుల అనుమతి లేకుండా వారి భూమి, భవనాలను ప్రచారానికి వాడకూడదు.
ఇతర పార్టీల ఎన్నికల ప్రచారాన్ని, సమావేశాలను ఆటంకపరచవద్దు.
సమావేశాలు ఏర్పాటు చేయదలిస్తే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. మైకులు, లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి. నిషేదాజ్ఞలు, ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించకూడదు. సమావేశాలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప నేరుగా వారిపై దాడులు చేయకూడదు.
ఊరేగింపు తీయాలంటే తొలుత పోలీసుల అనుమతి తీసుకుని, రూటును ముందుగానే పోలీసులకు తెలియచేయాలి. నిషేధాజ్ఞలు ఉన్న రూటులో ఊరేగింపు తీయకూడదు. ఊరేగింపు సమయంలో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలి. ఎవరి దిష్టిబొమ్మలను తగలబెట్టకూడదు.
పోలింగ్‌రోజు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేందుకు సిబ్బందికి అందరూ సహకరించాలి. పోలింగ్ సమయంలో ఇచ్చే ఎలక్షన్ స్లిప్పులు, ఓటరు చీటీలపై పార్టీ ఎన్నికల గుర్తులు, అభ్యర్థి పేరు ఉండకూడదు.
పోలింగ్ సమయానికి ముందు 48 గంటల నుండి మద్యం అమ్మకాలు కొనసాగించకూడదు.
ఎన్నికల అధికారులు ధృవీకరించిన పాస్ లేకుండా పోలింగ్‌బూత్‌లోకి ఎవరూ వెళ్లకూడదు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్నికల పరిశీలకులకు తెలియచేయాలి.
అధికార పార్టీ ఎన్నికల ప్రచారాన్ని అధికార పర్యటనలతో కలిపి చేయకూడదు. అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ వాహనాలను, వాడకూడదు. ప్రభుత్వ ఖర్చుతో మీడియాలో ప్రకటనలు ఇవ్వకూడదు. వాగ్దానాలు చేయకూడదు. కొత్త్భవనాలకు, కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయకూడదు.
మంత్రులు పోలింగ్ స్టేషన్లలోకి వెళ్లకూడదు. మంత్రులు ఎన్నికల అధికారులను పిలవకూడదు.