రాష్ట్రీయం

మహా కూటమిలో సీపీఐ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 16: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఒక్కటైన పార్టీలకు సీట్ల కేటాయింపుల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ నేతల వైఖరిని సీపీఐ నేతలు బాహాటంగానే తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము కావాలన్న సీట్లలో కనీసం సగం కూడా ఇవ్వకపోవటం బాధాకరమంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం స్థానాలు ఇవ్వకపోతే తాము స్వంతంగానే పోటీ చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెగేసి చెప్పారు. రెండు రోజుల క్రితం వైరా నియోజకవర్గంలో సుమారు 50 కిలోమీటర్ల మేర సాగిన మోటర్ సైకిల్ ర్యాలీలో మహాకూటమిలోని ఇతర పార్టీలు పాల్గొనకపోగా సీపీఐ నేతలు మాత్రం వైరాలో కచ్చితంగా పోటీ చేస్తామని, ఇక్కడ పోటీ చేయలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్రంగానే పోటీ చేస్తామని ప్రకటించారు. 12స్థానాలలో తాము బలంగా ఉన్నామని, మరో 30 స్థానాలలో గెలుపు, ఓటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నామని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొత్తులు ఖరారైతేనే రాష్ట్ర వ్యాప్తంగా పొత్తులు కుదురుతాయని బహిరంగ సభలో పేర్కొన్నారు. అదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు తమకు మంచి ప్రాతినిధ్యం లభించేదని పేర్కొనటం విశేషం. దీనిపై కాంగ్రెస్ నేతలు మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చర్చించినట్లు సమాచారం. సీపీఐ నేతలు ఈ స్థాయిలో విమర్శలు చేయటం జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు ఖమ్మం జిల్లాలో పొత్తులపై తొలుత నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలతో కూడా చెప్పినట్లు తెలిసింది.