రాష్ట్రీయం

ఉద్యోగాలు ఇవ్వమంటే.. బర్రెలు..గొర్రెలు..చేపలు ఇస్తావా కేసీఆర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 16: చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వమంటే బర్రెలు, గొర్రెలు, చేపపిల్లలు అంటూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో యువత తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి, మద్దూర్ మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోటార్ బైక్‌ర్యాలీ, రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పీసీసీ వర్గింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఓడించడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా ప్రయత్నిస్తున్నారని వారి ప్రయత్నాలను కోడంగల్ నియోజకవర్గ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్థులకు, యువతకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. తమకు ఉద్యోగాలు ఇవ్వమని విద్యార్థులు, యువత ప్రశ్నిస్తుంటే వారి గొంతునొక్కి కేసులు పెడుతున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో యువత సత్తా ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో కులవృత్తిపై బతుకుతున్న గౌడ కులస్తులు, గీతాకార్మికుల జీవితాల్లో కేసీఆర్ మట్టికొట్టారని ధ్వజమెత్తారు. లంబాడీల జీవిన విధానంపై దెబ్బతీసిన కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ది చెప్పడానికి గిరిజను సిద్దంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కొంత మంది మంత్రులు చిల్లరగాళ్ల మాదిరి తయారైయ్యారని అందులో మంత్రి మహేందర్‌రెడ్డి ఒకరని ఆయన ఎంత స్థాయికి దిగజారడంటే ఎవరి ఇళ్లలో పెళ్లీలు చేసుకున్న కొత్త జంటలు కనిపిస్తే వారి కుటుంబాల నుండి భరణంగా ఇచ్చిన ఆస్తిలో కూడా పర్సెంటేజీలు తీసుకునే దుర్మార్గులా తయారైయ్యారని దుయ్యాబట్టారు. యువకులకు, విద్యార్థులకు టీఆర్‌ఎస్‌ను బొందపెట్టడానికి ముందస్తుగా ఓ అవకాశం ఇచ్చారని ఈ అవకాశాన్ని అందరు సద్వీనియోగం చేసుకుని కేసీఆర్ రాక్షస పాలనకు అంతమొందించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్నం ముఠా కోడంగల్‌కు వచ్చిందని ఆ ముఠా ఆటలు ఇక్కడ చెల్లుబాటుకావని హెచ్చరించారు. కేసీఆర్ కాళ్ల దగ్గర బానీసలుగా బతికే నాయకులను కోడంగల్ ప్రజలు కోరుకోరని అసెంబ్లీలోకి వెళ్లి గట్టిగా పోరాడే నాయకులను కడుపులోపెట్టుకుని గెలిపించుకుంటారని అన్నారు.