రాష్ట్రీయం

జూ. కాలేజీలకు మరో రెండ్రోజులు సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మరో రెండు రోజుల పాటు సెలవులు పొడిగించినట్టు బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. గతంలో 18వ తేదీ వరకూ సెలవులు ఇచ్చామని, 19, 20 తేదీల్లో కూడా సెలవులు అదనంగా ప్రకటించినట్టు పేర్కొన్నారు. 21 ఆదివారం కావడంతో 22 నుండి కాలేజీలు పున:ప్రారంభం అవుతాయని అన్నారు. ప్రభుత్వ కాలేజీలతో పాటు ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలకూ వర్తిస్తుందని చెప్పారు. 21 వరకూ ఏ కాలేజీ బలవంతంగా తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.

19న బిఈడీ స్పెషల్ అడ్మిషన్లు
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ఆఫర్ చేస్తున్న బిఈడీ (స్పెషల్) కోర్సులో ప్రవేశాలను ఈ నెల 19న చేపట్టనున్నట్టు విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ పి కృష్ణారావు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 11 కేంద్రాలకు సంబంధించి యూనివర్శిటీ హైదరాబాద్ ప్రాంగణంలోనే అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు.