రాష్ట్రీయం

కేసీఆర్ డబుల్ గేమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి
==============

హైదరాబాద్, అక్టోబర్ 17: ‘అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మజ్లీస్‌తో, వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రయాణం చేసేందుకు డబుల్ గేమ్ ఆడుతున్నారు’ అని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికల్లో ‘కేసీఆర్ అండ్ కంపెనీ’కి ముగింపు పలకాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి బుధవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రశ్నలకు తీవ్రంగా ప్రతిస్పందించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని తేల్చి చెప్పారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కుటుంబ పాలన సాగుతున్నదని, ఫిరాయింపుదారులకు, కేసీఆర్‌కు సేవ చేసిన వారికే పదవులు ఇచ్చారని, అమర వీరుల కుటుంబాలకు ఆదరణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
* టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి 40 రోజులు దాటింది, మీ పార్టీ (కాంగ్రెస్) ఇంకా పొత్తులు తేల్చుకోలేదు, అభ్యర్థులను ప్రకటించలేదు?
* ప్రజల మధ్య ఉండే పార్టీకి ఆ భయం అవసరం లేదు. అధికారంలో ఉన్నా, లేకున్నా క్షేత్ర స్థాయిలో ప్రజలతోనే ఉంటాం, ఇక పొత్తులంటారా, కలిసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నాం, సీట్ల సర్దుబాటు జరుగుతుంది, పైగా 50 శాతం (60 స్థానాల్లో) అభ్యర్థులు ఎవరో ప్రజలకు తెలుసు. స్పష్టత ప్రజలకు ఉంది. కేవలం 35 సీట్లలోనే పొత్తులు కుదరాల్సి ఉంది.
* ప్రచారంలో ‘కారు’ దూసుకెళుతున్నది, ఆ స్పీడును అందుకోగలరా?
* నిత్యం ప్రజలతోనే ఉండే కాంగ్రెస్‌కు కొత్తగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు, అయినా ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత టీఆర్‌ఎస్ మూడు బహిరంగ సభలు నిర్వహిస్తే, మేము ఆరు సభలు నిర్వహించాం, అంతేకాదు మా పార్టీ ముఖ్య నేతలంతా నలువైపులా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
* ఫలితాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు?, జంపింగ్‌లు తప్పవా?
* కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడేందుకు ఆస్కారమే లేదు, కాబట్టి జంపింగ్‌లకు అసలే అవకాశం లేదు.
* ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఢీల్లీలో పడిగాపులు కాసే పార్టీ కావాలా? ప్రజలకు అందుబాటులో ఉండే టీఆర్‌ఎస్ కావాలా?, ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఒకే ఓటుతో నాలుగు పార్టీల కూటమిని కొట్టండి అని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు?
* మా పార్టీకి అధిష్టానం ఉంది. అధిష్టానం అంటే అందరికీ గౌరవం, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. కానీ టీఆర్‌ఎస్ అనేది వన్ మ్యాన్ ఆర్మీ వంటిది, కేసీఆర్ చెప్పిందే వేదం, కేసీఆర్ కుటుంబం తప్ప ఇతరులకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, కేసీఆర్ నియంతృత్వ పోకడల గురించి అపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏమన్నారో రాష్ట్ర ప్రజలంతా చూశారు.
* కాంగ్రెస్‌లో 10 మంది సీఎం అభ్యర్థులున్నారు..?
* ఆశావాహులు ఉండకూడదా?, కానీ ఫలితాలు వెలువడిన తర్వాత అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్‌లో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఉందనేది దీనిని బట్టి గమనించండి. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కాకుండా మరో పార్టీ నాయకున్ని సీఎం చేయగలరా? అంతేందుకూ గత ఎన్నికల ముందు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామన్న ఏమైందో ప్రజలందరికీ తెలుసు.
ప్ర: కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.500 కోట్లు, మూడు హెలికాప్టర్లు పంపించారని టీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది కదా?
జ: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించనున్నది తెలుసుకున్న కేసీఆర్ అసహనంతో, అభద్రతా భావంతో ఉన్నారు. అందుకే ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో టీఆర్‌ఎస్ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసింది కదా, అప్పుడు ఎన్ని కోట్లు తీసుకుందో చెప్పగలదా? కాబట్టి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండడం మంచిదని హితవు చెబుతున్నాను.
ప్ర: కేసీఆర్ ప్రకటించిన పాక్షిక ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలు ఆకర్షితులవుతారేమో!?
జ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు, అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్ళలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఇంకా కేసీఆర్ మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో వారు లేరు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ప్రకటిస్తే, కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల అమలుకు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల బడ్జెట్ కలిపినా అమలు సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు, మరి ఇప్పుడు కేసీఆర్ ఎలా అమలు చేశారు, మా మేనిఫెస్టొను కాపీ కొట్టారు, కాపీ కొట్ట లేదనడానికి పైన రూ.16 తగిలించారు.
ప్ర: ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే మీరు సీఎం రేసులో ఉంటారా?
జ: (నవ్వుతూ) ఈ ప్రశ్న అప్రస్తుతం, ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళడమే నా నైజం, ఏదైనా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది.