రాష్ట్రీయం

మేనిఫెస్టోనే విడుదల కాలేదు.. కాపీ ఎలా కొడతారు ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ప్రకటించలేదు, అలాంటప్పుడు తామేలా కాపీ కొడుతామని టీఆర్‌ఎస్‌లో ముఖ్య నాయకుడు, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. తాము కూడా రైతుబంధు, రైతు బీమా పథకాలను కొనసాగిస్తామంటున్న కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూడా కొనసాగిస్తామని చెబితే బాగుండేదని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ నేతలు ప్రజల నాడీ తెలుసుకోకుండా తామే అధికారంలోకి వస్తామని ఉహాల్లో తేలాడుతున్నారని వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, అధికారం లేకపోతే ప్రజల మధ్యలో ఉండలేనిస్థితికి కాంగ్రెస్ నేతలు చేరుకున్నారన్నారు. రెండు వేల పెన్షన్ తాము కూడా ఇస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు వారు అధికారంలో ఉన్నప్పుడు రెండు వందలు మాత్రమే ఇచ్చిన విషయం మరిచిపోయారా? అని వినోద్‌కుమార్ నిలదీసారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమని సవాల్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఆపాలని కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజా కోర్టులో తేల్చుకుందామని తమ అధినేత, సీఎం కేసీఆర్ సవాల్ విసిరితే, ప్రజా కోర్టుకు భయపడి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వినోద్ విమర్శించారు. వందకు పైగా సీట్లతో ఘన విజయం సాధించి డిసెంబర్ 11 తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటు కోబోతుందని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం తాము గొర్రెలు, బర్రెలు ఇస్తే కాంగ్రెస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ సొంతంగా పాడిపరిశ్రమ అభివృద్ధి కావద్దా అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తమ మేనిఫెస్టోను టీఆర్‌ఎస్ కాపీ కొట్టిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామంటే ప్రజలు నమ్మలేదని తలసాని గుర్తు చేసారు. క్షేత్రస్థాయిలో సమాచారాన్ని నిర్దారించుకుండా ఇంటింటికి నీళ్లు ఎక్కడొచ్చాయని విమర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకుంటే నీళ్లు ఎక్కడ వస్తున్నాయో కనిపిస్తాయని మంత్రి ఎద్దేవా చేసారు. ఆంధ్రా వాళ్లంతా టీఆర్‌ఎస్ పార్టీకే అండగా ఉన్నారని, తన సనత్ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని తలసాని అన్నారు.