రాష్ట్రీయం

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే పంచాయతీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హైకోర్టు ఆదేశాల అమలును పరిశీలించిన ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలపై గత ఐదురోజుల నుండి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఈ నెల 11 న ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. అప్పటికి ఎలాగూ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కాగా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటే తొలుత బీసీల జనాభా గణన చేయాల్సి ఉంది. బీసీల జనాభా గణన జరగకపోతే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం రాష్ట్ర యంత్రాంగమంతా శాసనసభ ఎన్నికల నిర్వహణలో మునిగి ఉంది. డిసెంబర్ 7 న శాసనసభ పోలింగ్ జరిగి, ఫలితాలు వెల్లడి తర్వాత ఏర్పడే ప్రభుత్వంపై పంచాయతీ ఎన్నికల బాధ్యత పడుతుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు వెంటనే నిర్వహంచాలంటే మొదట బీసీల జనాభా గణన చేయాల్సి ఉంటుంది. బీసీల జనాభా గణనకు ఆదేశాలు జారీ చేస్తే వారం, పదిరోజుల్లో వివరాలు సేకరించేందుకు వీలవుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. బీసీల జనాభా గణన ఎవరి చేత చేయించాలన్న అంశంపై కొత్తగా ఏర్పడే ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికలను మూడునెలల్లో నిర్వహించాలంటూ హైకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాలపై ఒక సమగ్ర నివేదికను పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి నివేదించిందని తెలిసింది. ప్రస్తుతం ఆపద్దర్మ ప్రభుత్వ కొనసాగుతున్నందువల్ల పంచాయతీ ఎన్నికలపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషికి పంచాయతీరాజ్ శాఖ నివేదిక చేరింది. ఆయన కూడా ఈ అంశంపై ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు 2019 జనవరి 10 లోగా పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటే యుద్ధప్రాతిపదికపై బీసీల జనాభా గణన తొలుత పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీలతో పాటు బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై చట్టానికి లోబడి నిర్ణయం తీసుకుంటే పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. సర్పంచ్‌ల స్థానాలు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తూ నివేదిక పంపించిన 30-40 రోజుల్లో ఎన్నికలు నిర్వహించగలుగుతామని ఈ సంఘం అధికారులు చెబుతున్నారు.