రాష్ట్రీయం

కర్రల సమరానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 17: విజయదశమి రోజు జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని గట్టుమల్లయ్య కొండల్లో వెలసిన శ్రీ మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం సందర్భంగా భక్తులు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీ. స్వామివారి ఉత్సవమూర్తులకు రక్షణగా కొత్తపేట, నెరణికి, నెరణికి తండావాసులు కర్రలు, కాగడాలతో ముందుకుసాగుతారు. ఈ క్రమంలో ఉత్సవమూర్తులను తీసుకువెళ్లేందుకు వచ్చేవారితో తలపడడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో భక్తులు పరస్పరం తలపడడంతో తలలు పగలడం, కాళ్లు చేతులకు గాయాలు కావడం ప్రతిఏటా జరుగుతోంది. శుక్రవారం అర్థరాత్రి బన్ని ఉత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. బన్ని ఉత్సవం రక్తసిక్తం కాకుండా ఉండేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భక్తులు ఏటేటా కర్రలతో తరలివస్తున్నారు. ఉత్సవం రక్తసిక్తమవుతూనే ఉంది. బన్ని ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఉత్సవంలో కర్రలను అడ్డుకునేందుకు పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినా, విస్తృత తనిఖీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. ఈసారి కూడా పోలీసులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించారు.