రాష్ట్రీయం

తిత్లీని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 29నాటికల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆదేశం

శ్రీకాకుళం, అక్టోబర్ 17: తిత్లీ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో తుఫాన్‌లు వచ్చాయని, ప్రాణనష్టం జరిగినా తిత్లీ తుఫాన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలవల్ల ఈ నష్టాన్ని బాగా తగ్గించగలిగామన్నారు. తుఫాన్ రోజున ఐదుసార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ ప్రాంతంలో పునరావాస చర్యలు వేగవంతం చేసేందుకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఎంతో బాగా పనిచేస్తున్నారని సీఎం కితాబు ఇచ్చారు. మంత్రులు, అధికారులు కార్యకర్తల్లా పనిచేస్తున్నారన్నారు. తుఫాన్ సాయంకోసం కేంద్రానికి కోరితే ఇంతవరకు సహాయం అందించలేదన్నారు. మీకు ధైర్యం చెప్పాలని వస్తే మీరు మాకు కొండంత ధైర్యం ఇచ్చారన్నారు. జీడి, కొబ్బరి తోటలకు నష్టపరిహారం ఇస్తామన్నారు. తిత్లీ ఉద్దానం రీహేబిలిటేషన్ టర్ఫాన్న్ ఏర్పాటు చేస్తామన్నారు. కోటబొమ్మాళిలో సీఎం పర్యటించి 15 మంది మంత్రులు, ఐఏఎస్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్‌లు ఇక్కడినుంచే పనిచేస్తున్నారన్నారు. మంత్రి అచ్చెన్న మోటార్ సైకిల్‌పై తిరిగి బాధితులకు ఆత్మస్థైర్యం నింపారన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు తన నియోజకవర్గమంతా పర్యటించి బాగా పనిచేస్తున్నారన్నారు. సముద్ర తీరప్రాంతంలో రహదారిని అభివృద్ధి చేసి జాతీయ రహదారికి కలిపితే ఈ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధిచెందుతుందని బాబు తెలిపారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రజలను ఆదుకోవాలి తప్ప రాజకీయాలు చేస్తూ విమర్శలు చేయకూడదని సీఎం హితవు పలికారు. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం, విశాఖపట్నంకు బీచ్‌రోడ్డు అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ వస్తాయని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి అయ్యన్నపాత్రుడు, శోభాహైమవతి తదితరులున్నారు. తిత్లీ తుపాను సహాయక చర్యలను ఆటంకం కల్గించే చర్యలపై ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు ప్రభుత్వం అంతా వచ్చి, సహాయక చర్యలు కొనసాగిస్తుంటే, కొందరు మాత్రం పనికట్టుకుని ఆందోళనలు చేయాలంటూ రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు ఆటంకం కల్గిస్తే, తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ఇలావుండగా, శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను జాడలు ఇక ఎక్కడా కన్పించకూడదని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఏ ఒక్కరికీ చెడుపేరు రాకుండా తొలుత 22న ప్రాథమిక నోటీఫికేషన్, 25న అభ్యర్థుల పరిశీలన, 27న తుది నోటిఫికేషన్ జారీ చేసి 29, 31 తేదీకల్లా గ్రామసభల్లో ఒకేరోజు అందరికీ చెక్కులు పంపిణీ చేయాలని సూచించారు. దాదాపు 91వేల హెక్టార్లలో 2లక్షల మందికి పైగా రైతులకు పంటనష్టం జరిగిందంటూ, ఇళ్లకు జరిగిన నష్టాలపై సత్వరం అంచనాలు వేయాలన్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ఇళ్లకు విద్యుత్ సరఫరా, ఏడు రోజుల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ పునరుద్ధరించేందుకు ప్రస్తుతం 307 జనరేటర్లు పనిచేస్తున్నాయని, మరో 35 వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం 230 ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఏదిఏమైనా తుపాను బాధితులకు నూటికి నూరు శాతం సంతృప్తి కలిగించాలని చంద్రబాబు ఆదేశించారు.