రాష్ట్రీయం

మహాగౌరీ అవతారంలో బాసర అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, అక్టోబర్ 17: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు బుధవారం శ్రీ అమ్మవారు మహాగౌరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర నుండి భక్తులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు నదీ తీరాన కొలువైన శివాయంలో పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్షరాభ్యాస పూజల కోసం క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని వెయ్యి, 100 రూపాయల అక్షరాభ్యాస మండపంలో చిన్నారులకు అక్షర శ్రీకార పూజలను ఆలయ అర్చకులచే ఘనంగా జరిపించారు. భక్తులు, చిన్నారులు అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గాష్టమి సందర్భంగా వేద పండితులు నవచండీ హవన, కళశస్థాపన, ముఖ్య దేవత, అగ్ని ప్రతిష్ట, ఛండీహోమంను వేద మంత్రోచ్చరణలతో వేడుకగా నిర్వహించారు.