రాష్ట్రీయం

మహాగౌరిగా భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం అక్టోబర్ 17: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం భ్రమరాంబిక అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవారికి గజవాహన సేవ నిర్వహించారు. నవదుర్గ అలంకారాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని మహాగౌరి స్వరూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు. నవదుర్గ రూపాల్లో ఎనిమిదో రూపం మహాగౌరి. మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తి. తెల్లని వృషభాన్ని అధిరోహించి ఉండే ఈ దేవి తెల్లని వస్త్రాలు ధరించి, చతుర్భుజాలు కలిగి ఉంటుంది. కుడివైపు త్రిశూలం, అభయహస్తం, ఎడమవైపు వరముద్ర, ఢమరుకం ధరించి ఉంటుంది. మహాగౌరి పార్వ తి రూపంలో పరమశివున్ని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేస్తుంది. ఈ తపస్సు కారణంగా ఈమె శరీరమంతా నల్లబడుతుంది. తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఈమె శరీరంపై గంగాజలాన్ని చిలకరిస్తాడు. అప్పుడు ఆదేవి తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారుతుంది. అందుకే ఈదేవి మహాగౌరిగా పిలువబడుతోంది.