రాష్ట్రీయం

ఎన్నికల వ్యూహంపై కేసీఆర్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రతిపక్షాలు తేరుకోక ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకెళుతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్నందున తమ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా నడచుకోవాలి?, ఇతర పార్టీల ఎత్తులను ఎలా చిత్తు చేయాలి?, అభ్యర్థులకు స్థానికంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా?, పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా పని చేస్తున్నారా?, ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలి?, ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 21న ‘అవగాహన సదస్సు’ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సదస్సు ఏర్పాటు చేశారు. పార్టీ ఇదివరకే ప్రకటించిన 105 నియోజకవర్గాల అభ్యర్థులు విధిగా ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ శుక్రవారం ఆదేశించింది.