ఆంధ్రప్రదేశ్‌

సాగుకు ఊతమిచ్చిన ఘనత చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఊతమిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని పలువురు సభ్యులు అన్నారు. 20 నెలల్లో వ్యసాయ రంగానికి ప్రాణంపోసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. సోమవారం శాసనసభలో వ్యవసాయ పద్దుపై జరిగిన చర్చలో పాల్గొన్న తెలుగుదేశం సభ్యుడు డాక్టర్ రామానాయుడు మాట్లాడుతూ దేశంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కిందని అన్నారు. దీన్ని ప్రతిపక్ష నాయకుడు ప్రశంసించకపోవడం విచారకరమని అన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కమిటీ వేసి, ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల నష్టపరిహారాన్ని అందించిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. గత వైఎస్ పాలనలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టి రైతాంగానికి శాశ్వత ప్రయోజనం కల్పించే ప్రయత్నం చేస్తుంటే దానిని కూడా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత జగన్ ఇక ప్రజా సంక్షేమం కోసం ఏమి కోరతారని ప్రశ్నించారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయానికి, ఉపాధి హామీ పథకానికి లింకు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఈ పద్దతి వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.అంతకుముందు విద్యుత్ అంశంపై అమలాపురం సభ్యుడు ఆనందరావు మాట్లాడుతూ వైఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం ఘోరంగా దెబ్బతిన్నదని అన్నారు. కేవలం 243 మెగావాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రజలపై 25 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిన ఘనత కూడా వైఎస్‌దేనని అన్నారు. పద్దులపై చర్చను ముగిస్తున్నట్లు ప్రకటించిన సభాపతి కోడెల శివప్రసాదరావు మిగిలిన పద్దులు, మంత్రులు జవాబు ఇవ్వడాన్ని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అసెంబ్లీకి రేపటినుంచి
మూడు రోజుల సెలవు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఈ నెల 23 నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెలవు విషయంలో స్వల్ప మార్పు చేశారు. 23న హోళి పండుగకు, 25న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించారు. ఈ రెండు సెలవు రోజుల మధ్య 24న సెలవు ఇవ్వలేదు. అయితే మధ్యలో ఒక్క రోజు కోసం ఎమ్మెల్యేలు దూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంటుంది కాబట్టి 24న కూడా సెలవు ఇచ్చి, ఆ రోజు అజెండాను ఈ నెల 28న (సోమవారం) సాయంత్రం కూడా సమావేశాన్ని నిర్వహించి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీన సమావేశాలు ముగించేందుకు అజెండాను బిఎసి ఇదివరకే ఖరారు చేసింది.

నేడు అసెంబ్లీకి వైకాపా సభ్యులు
సభాహక్కుల కమిటీ నోటీసిస్తే
రోజా హాజరుకు నిర్ణయం?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 21: వరుసగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరు కాని వైకాపా మంగళవారం సభకు హాజరు కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంగళవారం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సస్పెన్షన్ వ్యవహారంపై హైకోర్టు వెలువరించే తీర్పుపై వైకాపా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదే సమయంలో శాసనసభ సోమవారం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులపై కూలంకషంగా చర్చించింది. ఈ చర్చలో వైకాపా పాల్గొనలేదు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆర్‌కె రోజా ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యేందుకు వీలుగా మరో అవకాశం ఇస్తామని సంకేతాలు పంపారు. దీనిని పాజిటివ్‌గా తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌కు సూచించినట్లు సమాచారం. సోమవారం సభలో తాము లేకపోయినా ఈ విషయమై ఏకపక్షంగా చర్చించారనే అసంతృప్తితో వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో కమిటీ సిఫార్సులపై సభ ఎటువంటి తీర్మానం చేయలేదు. మరోసారి రోజాకు కమిటీ ఎదుట హాజరయ్యేందుకు వీలు కల్పిస్తున్నందు వల్ల అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే భావనతో వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే హైకోర్టు తీర్పు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఎలా ఉన్నా, అసెంబ్లీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే దిశలో పార్టీ వ్యూహం ఉంటే బాగుంటుందని వైకాపా ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. ఇదంతా టిడిపి అసెంబ్లీలో తమ పట్ల అనుసరించే ధోరణిని బట్టి ఉంటుందని ఆయన చెప్పారు. రోజాకు ప్రివిలేజ్ కమిటీ నుంచి ఎప్పుడు నోటీసు అందినా హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నోటీసు ఎప్పుడు వస్తుందో వేచి చూడాలనుకుంటున్నామని వైకాపా ఎమ్మెల్యేలు చెప్పారు.