రాష్ట్రీయం

ఏయూ దూరవిద్యలో ఆన్‌లైన్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: ఆంధ్ర యూనివర్శిటీ దూరవిద్య కేంద్రంలో ఇక మీదట ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తుల స్వీరకరణ మొదలు, పరీక్షల విధానంతో సహా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు వెల్లడించారు. ఏయూ సెనేట్ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏయూ దూరవిద్యలో ప్రవేశాలు కల్పించడంతో పాటు పరీక్షల విధానాన్ని ఆన్‌లైన్ కూడా ఆన్‌లైన్ చేశామన్నారు. విద్యార్థులు ఎక్కడనుంచైనా ప్రవేశాలు పొందడంతో పాటు పరీక్ష ఫీజులు చెల్లించుకోవచ్చన్నారు. టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. సాంకేతికను లాభదాయంగా మార్చుకుని దేశ వ్యాప్తంగా విద్యార్థులకు దూరవిద్య సేవలు అందించేందుకు ఈ విధానం ద్వారా సాధ్యపడుతుందన్నారు. భవిష్యత్‌లో విద్యార్థులు తమ ఇంటి నుంచి అన్ని సేవలు పొందేందుకు ఈ విధానం ఉపకరిస్తుందన్నారు. ఎక్కడెక్కడ నుంచి వర్శిటీ దూరవిద్య కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని, దీనివల్ల ఖర్చు, సమయం ఆదా అవుతుందన్నారు. ఒకే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల మంజూరు వంటి చర్యలు ఇకపై మరింత సులభతరంగా, వేగవంతంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఆన్‌లైన్ సేవల వల్ల పారదర్శకతతో పాటు జవాబుదారీ తనం పెరుగుతుందన్నారు. అలాగే విశ్వవిద్యాలయం అధికారులకు అవసరమైన ఉప సమాచారాన్ని ఎల్లవేళలా పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అంతకు ముందు ఆయన ఆన్‌లైన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య కే నింరజన్, దూరవిద్య కేంద్రం ఇన్‌ఛార్జి సంచాలకులు ఆచార్య పీ హరిప్రకాష్, టీసీఎస్ అయాన్ సౌత్‌జోన్ ఇన్‌ఛార్జి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.