రాష్ట్రీయం

ఒకేరోజు రెండు అవతారాల్లో.. శ్రీమహిషాసుర మర్దని, శ్రీరాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం దుర్గమ్మ తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు శ్రీమహిషాసుర మర్దనిదేవి అలంకారంలోనూ ఆ తర్వాత నుంచి శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలోనూ భక్తకోటికి దర్శనమిచ్చింది. ఒకే రోజు రెండు అవతారాలతో దుర్గమ్మను దర్శించుకోటానికి వచ్చిన అశేష భక్తజనంతోనూ, ఆపై దీక్ష విరమణకు వచ్చిన భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. ఈ దసరా వేడుకల్లో అత్యంత పర్వదినమైన మూడింటిలో శరన్నవమి అత్యంత పవిత్రమైంది. చండీ సప్తశతలో దుర్గదేవి అష్ట్భుజాలతో దుష్టరాక్షసుడైన మహిషాసురిడిని సంహరించి లోకోపకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.

అత్యంత రమణీయంగా తెప్పోత్సవం
దసరా శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా శ్రీదుర్గామల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు హంస వాహనంపై కృష్ణానదిలో విహరించేందుకు వేంచేశారు. ఇంద్రకీలాద్రిపై నుండి ఉత్సవమూర్తులు దుర్గాఘాట్‌కు భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలు, బేతాళ నృత్యాలు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తరలివచ్చారు. అత్యంత రమణీయంగా కన్నులపండుగగా తెప్పోత్సవం కార్యక్రమాన్ని శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, జిల్లా పరిపాలన యంత్రాంగం, పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీటికి తోడుగా ఇరిగేషన్, ఫిషరీస్, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ సంస్థ తదితర అన్ని సమన్వయ శాఖల ఆధ్వర్యంలో తెప్పోత్సవం కోసం చక్కని ఏర్పాట్లు చేశారు. మూడు పర్యాయాలు హంస వాహనం కృష్ణానదిలో వివరింపజేశారు. తొలి పర్యాయం 45 నిమిషాల పాటు సాగిన తెప్పోత్సవం, రెండవ పర్యాయం 25 నిమిషాలు, మూడవ పర్యాయం 15 నిమిషాలు జరిగింది. వేదపడింతులు వేద మంత్రాల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు పూజలను నిర్వహించారు. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు దూప, దీప నైవేద్యాలను అందజేశారు. ముమ్మారు కృష్ణానదిలో విహరిస్తూ నదికి హారతులను అందించారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత రమ్యంగా విద్యుత్ దీపాలతో హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ఆకట్టుకున్న బాణాసంచా
కృష్ణానదిలో హంస వాహనం ముమ్మారు విహరిస్తున్న సమయంలో కృష్ణానది మధ్యలో ఉన్న లంకపై బాణాసంచా వెలుగులు విరజిమ్మాయి. హంస వాహనం వివారిస్తున్న 75 నిమిషాల పాటు బాణాసంచా వెలుగులు కృష్ణానదిలో కనబడుతూ ఆకాశాన్ని, నదిని ఏకం చేసేలాగా ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ వి కోటేశ్వరమ్మ దంపతులు, ఆలయ చైర్మన్ గౌరంగబాబు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు దంపతులు, జాయింట్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హంస వాహనం విద్యుత్ కాంతులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దుర్గాఘాట్ మొత్తం భక్తసందోహంతో నిండిపోయింది.

పెరిగిన భక్తుల రద్దీ, ఆదాయం
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి దసరా ఉత్సవాల్లో గత ఏడాదికంటే కూడా ఈ ఏడాది అనూహ్యంగా భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా పెరిగింది. 2017లో భక్తులు 7లక్షల 59వేల 800 మంది రాగా ఈదఫా 14లక్షల 79వేల 053 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు.
ఇక ఆదాయం గత ఏడాది 2కోట్లు 60లక్షల 48వేల 177 రూపాయలు కాగా ఈ దఫా రూ.3కోట్ల 15లక్షల 91వేల 417 రూపాయలు వచ్చింది. ఉచితంగా లక్షా 64వేల మంది భక్తులకు అన్నదానం, 12వేల 127 మందికి ఉచితంగా పులిహార ప్రసాదం, 6లక్షల 17వేల మందికి అప్పం ప్రసాదం, 6లక్షల 85వేల మందికి ఉచిత కుంకుమ ప్యాకెట్లు అందజేశారు. 69వేల మంది వికలాంగులకు దర్శన సౌకర్యం కల్పించారు.