రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 20: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు పన్నిన వ్యూహాన్ని అక్కడి పోలీసులు తిప్పికొట్టారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను భగ్నం చేయాలనే వ్యూహంతో మావోయిస్టులు శనివారం సమావేశమైన తరుణంలో పోలీసులు చుట్టుముట్టి దాడి చేశారు. భీకరంగా దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి సమీప అడవుల్లోకి పరారయ్యారు. బీజాపూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో విధ్వంసం సృష్టించాలని బీజాపూర్ జిల్లా మిర్తూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల నుంచి మావోయిస్టులు భారీ సంఖ్యలో సమావేశమయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు అక్కడకు చేరుకుని అడవిని చుట్టుముట్టాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో జవాన్లు కాల్పులకు దిగారు. ఈ ఎదురుకాల్పులు దాదాపు గంటన్నరపాటు చోటు చేసుకోగా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలై పరారయ్యారని ఎస్పీ వెల్లడించారు. 303 రైఫిల్, రెండు బర్మార్ తుపాకులు, విప్లవ సాహిత్యం, పేలుడు పదార్థాలు సంఘటన స్థలిలో లభ్యమయ్యాయి. శుక్రవారం కూడా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల వ్యూహాన్ని పోలీసులు ఛేదించారు. బీజాపూర్ జిల్లా పరిధిలో ఉన్న నేషనల్ పార్కులోని నీలమడుగు అటవీ ప్రాంతంలో శుక్రవారం రెండుచోట్ల పెద్దఎత్తున స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. నవంబర్ 12న జరిగే తొలి దశ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళిక కోసం సమావేశమైన మావోయిస్టులను పసిగట్టిన బలగాలు అక్కడకు చేరుకున్నాయి. పోలీసుల రాక పసిగట్టిన మావోలు అక్కడి నుంచి జారుకున్నారు.
కాగా ఈ ప్రాంతంలో ఎన్నికలకు భగ్నం చేసేందుకు మావోయిస్టులు రూపొందించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వీటితో పాటు భారీ సంఖ్యలో ఆయుధాలు, ఐఈడీలు, పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో తమకు పట్టున్న బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు భారీ విధ్వంసానికి వ్యూహాలు పన్నుతున్నారన్న సమాచారం ఉందని, ముందస్తు సమాచారం మేరకు వారి ఎత్తుగడలను చిత్తుచేశామని బీజాపూర్ ఎస్పీ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు చేపడుతున్నామని, బలగాల కూంబింగ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.