రాష్ట్రీయం

ముగ్గురూ ముగ్గురే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలను తీవ్రంగా విమర్శించారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్‌ఎస్ మద్దతునిచ్చిందని, ఆ పార్టీతో మజ్లీస్ జత కట్టిందన్నారు. మూడు పార్టీలూ కలిసే ఉన్నాయని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీని తూర్పారబడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ తన ప్రసంగంతో కార్యకర్తలను ఉర్రూతలూగించారు. మోదీ, కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీలను తీవ్రస్థాయలో విమర్శిస్తుంటే కార్యకర్తలు ఆనందంతో కరతాళధ్వనులు చేశారు, కేరింతలు కొట్టారు. కార్యకర్తల్లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. రాహుల్‌ను చూసేందుకు కార్యకర్తలు ముందుకు తోసుకుని వచ్చేందుకు ప్రయత్నించడంతో, వారిని అదుపు చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది.
భైంసాలో ఎన్నికల శంఖారావం
భైంసా సభలో రాహుల్ ఎన్నికల శంఖారావం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి చూపిస్తామన్నారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదని, కర్నాటకలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రాణహితను పక్కన పెట్టి కాళేశ్వరం పేరిట దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వగానే యువకులు కేరింతలు కొట్టారు. తాము మూడు వేల రూపాయలు ఇస్తున్నామని తెలుసుకున్న అధికార పార్టీ మూడు వేల 16 రూపాయలు ఇస్తామని ప్రకటించిందని ఆయన విమర్శించారు. అంతకు ముందు మూడు వేల రూపాయలు ఇవ్వడం సాధ్యం కాదన్నారని ఆయన తెలిపారు. పత్తి రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల మద్దతు ధర ఇస్తామనడంతో రైతులు కరతాళధ్వనులు చేశారు. రూ.300 కోట్లతో భవనం నిర్మించుకున్న అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం బోధన్ నిజాం షుగల్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని రాహుల్ దుయ్యబట్టారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 3ప్రజాగర్జన2 సభలో రాహుల్ గర్జించారు. హిందీలో రాహుల్ ప్రసంగాన్ని పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలుగులోకి అనువదించారు. ప్రధాని మోదీ, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దొందుదొందేనని రాహుల్ దుయ్యబట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్‌కు అప్పగిస్తే, నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అనిల్ అంబానీకి అప్పగించి రూ.35 వేల కోట్ల అదనపు భారం పెంచారని, ఇది పెద్ద కుంభకోణమని ఆయన విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్, మజ్లీస్ కలిసి దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్న పార్టీలను మట్టికరిపించాలని రాహుల్ పిలుపునివ్వడంతో సభికులు రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
చార్మినార్ వద్ద..
చార్మినార్ వద్ద పార్టీ నాయకుడు జి. నిరంజన్ అధ్యక్షతన జరిగిన రాజీవ్ సద్భావన దినోత్సవంలో రాహుల్ పాల్గొన్నారు. రాహుల్ రాక సందర్భంగా చార్మినార్ చుట్టూ పక్కల పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. ప్రజలు నడుచుకుంటూనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. చార్మినార్ చుట్టు పక్కల రోడ్లన్నీ కిటకిటలాడాయి.
శనివారం తెలంగాణలో నిర్వహించిన సుడిగాలి పర్యటన సక్సెస్ అయ్యింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలు విజయవంతమయ్యాయి. నేతలు ఆశించిన దాని కంటే అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రాహుల్ పర్యటన దిగ్విజయం కావడంతో నేతల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఎన్నికల పోలింగ్‌లోగా ఇంకా రాహుల్‌తో ఒక్క రోజున రెండు జిల్లాల్లో ప్రచారం చేయించాలని, రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించి సోనియా గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆలోచన చేస్తున్నారు.