రాష్ట్రీయం

కోర్టుకెక్కిన మైనింగ్ లీజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 20: లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వంతాడ మైనింగ్ లీజుల్లో అపరాధ రుసుం వ్యవహారం కాస్తా ఇంకా కోర్టు నుంచి బయట పడలేదు. ఇటు కోర్టుకు వివరణ ఇస్తూనే.. మరోవైపు లీజుదారులకు ఉచిత సలహాలు ఇస్తూ కోర్టులను ఆశ్రయించేలా మైనింగ్ అధికారుల ద్విపాత్రాభినయం చేయడంవల్లే నేటికీ ప్రభుత్వ ఖజానాకు అపరాద రుసుము ఆదాయం రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. కొంతమంది మైనింగ్ అధికారుల లోపాయికారి ప్రోత్సాహంవల్లే లీజుదారులు ఈ విషయాన్ని కోర్టును అడ్డం పెట్టుకుని సంవత్సరాల తరబడి నెట్టుకొస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి రూ.100 కోట్ల అపరాధ రుసుము చిక్కుల్లో పడింది. అధికారుల తీరువల్ల ప్రభుత్వ ఖజానాకు ఖనిజ నిధులు దక్కకుండా పోయాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోర్టులో సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు లీజుదారులకు సహకారాన్ని అందించడం వల్లే ఇంతకాలం కోర్టు వివాదంలో అపరాధ రుసుం వసూలు చేసే అంశం పెండింగ్‌లో పడిందని తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వంతాడ, గుజ్జనపూడి గ్రామాల పరిధిలో మొత్తం 10 లీజులకు సంబంధించి సుమారు వెయ్యి ఎకరాల్లో లేటరైట్ మైనింగ్ లీజుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. లీజుదారులు నిర్దేశిత పరిధికి మించి తవ్వకాలు జరిపారని ఆరోపణలు రావడంతో మైనింగ్ అధికారులు సర్వే నిర్వహించి లీజుదారులపై మొదట రూ.14కోట్ల వరకు అపరాధ రుసుము చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి కోర్టులో సవాల్ చేస్తూ ఇప్పటికీ లీజుదారులు తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో సకాలంలో ప్రభుత్వానికి ఖజానాకి రావాల్సిన ఆదాయం దక్కకుండా పోతోంది.
ఈ దశలో రాష్ట్రం విడిపోయిన క్రమంలో మైనింగ్ గ్రేడింగ్ మారింది. అప్పటివరకు మేజర్ మైనింగ్‌లో ఉండే లేటరైట్ ఖనిజం ఇపుడు మైనర్ మైనింగ్‌లోకి వచ్చింది. దీంతో అపరాధ రుసుం రూ.100 కోట్లకు పెరిగింది. ఒక్కోటి పాతిక సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు లీజు కాలపరిమితి కలిగిన సుమారు 10 లీజులపై ఈ అపరాధ రుసుం విధించారు. 2016 నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఈ లీజులు రద్దయ్యాయి. ఇదే సమయంలో డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ లీజులపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. దీనిపై రాష్ట్రం విడిపోయిన తర్వాత మైనింగ్ పాలసీని కూడా రూపకల్పన చేసిన అనంతరం మైనింగ్ శాఖ కోర్టుకు తెలియజేసింది. ఈలోగా కోర్టు బెంచ్‌లు మారడం, జడ్జీలు మారడం, శెలవులు రావడం వంటి పరిస్థితులన్నీ లీజుదారులకు కలిసి వస్తున్నాయి. నేటికీ ఇంకా ఈ వ్యవహారం కోర్టులోనే నలుగుతోంది. ఈ క్రమంలో ప్రజావ్యాజ్యం కూడా పడింది. దీనిపై కూడా అధికారులు వివరణ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ వంతాడ మైనింగ్ కొండ వ్యవహారం కోర్టులో నలుగుతూనే ఉంది. మైనింగ్ ఆదాయం నిలిచిపోయినప్పటికీ అపరాద రుసుము రూ.100 కోట్లు ఇంకా ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా స్తంభించిపోయింది.